Jr.NTR: తహశీల్దార్ ఆఫీస్‏లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. రావడానికి పెద్ద కారణమే ఉందట..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Jul 30, 2021 | 5:32 PM

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తాహశిల్దార్ కార్యాలయంల జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. మండలంలోని గోపులారం

Jr.NTR: తహశీల్దార్ ఆఫీస్‏లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. రావడానికి పెద్ద కారణమే ఉందట..

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని తాహశిల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. మండలంలోని గోపులారం గ్రామంలో రెవెన్యూ పరిధిలోని 6.30 ఎకరాల భూమిని కొనుగోలు చేసినందుకు శుక్రవారం నాడు ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా సమాచారం. అనంతరం అక్కడే ఉన్న యువకులు జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ తో రిజిస్ట్రేషన్ అధికారి తహశీల్దార్ కృష్ణకుమార్.. కంప్యూటర్ ఆపరేటర్ రవళి తదితరులు ఎన్టీఆర్ తో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‏కు తిరుగు పయనమమ్యారు.

Ntr

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేయనున్నాడు. అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్.. బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్నారు.

Ntr 2

Also Read:  Ishq Movie Review: ‘ఇష్క్.. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’.. ఎలా ఉందంటే..

Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ

Amala Akkineni: బ్లూక్రాస్ సంస్థ పై వస్తున్న వార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన చైర్ పర్సన్ అమల..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu