Ishq Movie Review: ‘ఇష్క్.. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’.. ఎలా ఉందంటే..

చైల్డ్ ఆర్టిస్ట్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజా.. ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత

Ishq Movie Review: 'ఇష్క్.. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ'.. ఎలా ఉందంటే..
Ishq
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2021 | 4:45 PM

సినిమా.. ఇష్క్.. నటీనటులు.. తేజా సజ్జా.. ప్రియా ప్రకాష్ వారియర్.. రివీంద్ర విజయ్.. లియోనా లిషోయ్.. కథ.. రతీష్ రవి. దర్శకత్వం.. ఎస్.ఎస్.రాజు.. నిర్మాతలు.. ఎన్వీ ప్రసాద్.. పరాస్ జైన్ వాకాడ అంజన్ కుమార్.. సంగీతం.. మహతి స్వర సాగర్ ఛాయా గ్రహణం.. శ్యామ్ కె. నాయుడు.

చైల్డ్ ఆర్టిస్ట్‏గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజా.. ఇప్పుడు హీరోగానూ రాణిస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ.. బేబి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన తేజా.. ఇటీవల జాంబి రెడ్డి సినిమాతో హీరోగా సత్తా చాటాడు. తాజాగా ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం ఇష్క్.. ఇట్స్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఇందులో తేజాకు జోడిగా ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‏గా నటిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ మూవీకి ఎస్.ఎస్.రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు (జూలై 30)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా.

సిద్ధు అలియాస్ తేజా సజ్జా.. చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్‏వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. హస్టల్లో ఉండి చదువుకుంటున్న అను అలియాస్ ప్రియా ప్రకాష్ వారియర్‏తో ప్రేమలో పడతాడు. అను పుట్టిన రోజున తనతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళతాడు. అయితే వీరిద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో మాధవ్ (రవీంద్ర విజయ్).. పోలీసునంటూ వచ్చి వీళ్లను భయపెడతాడు. ఫోటోలు, వీడియోలు ఉన్నాయంటూ వీళ్లను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ క్రమంలోనే సిద్ధు, అనులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోన్నారు ? రవీంద్ర నుంచి ఎలా తప్పించుకున్నారనేది కథ.

ప్రతి సినిమాలో జరిగే స్టోరీలాగే అనిపించినా.. చిన్న చిన్న సన్నివేశాలతో ప్రేక్షకులకు సరికొత్త కథనాన్ని అందిస్తున్నట్లుగా సినిమాను రూపొందించారు. టైటిల్ క్యాప్షన్‏కు తగ్గట్టుగానే ‘ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే క్యాప్షన్ కు తగ్గట్లే ఇది ప్రేమకథా చిత్రం కాదు. లవ్ స్టోరీగానే ప్రారంభమైన ఈ మూవీ అనుక్షణం వచ్చే మలుపులతో ప్రేక్షకులను ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిణామాలు.. ప్రేమకులకు.. మోరల్ పోలీసింగ్ విధానంతో వేధించే వ్యక్తుల గురించి వ్యంగ్రాస్త్రంగా ఉంది ఇష్క్.

ఇక క్యారెక్టర్స్ విషయానికి వస్తే.. సిద్ధు పాత్రలో తేజ సజ్జా.. అను పాత్రలో ప్రియా ప్రకాష్ జీవించారనే చెప్పుకొవాలి. ఈ సినిమా ద్వారా మరోసారి తనలోని ప్రతిభను బయటపెట్టాడు తేజా సజ్జా. అలాగే ప్రియా ప్రకాష్ తన పాత్రలో బాగానే నటించింది. అలాగే విలన్ పాత్రలో నటించి రవీంద్ర విజయ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడనే చెప్పుకోవాలి. అతడి భార్య పాత్రలో చేసిన లియోనా లిషోయ్ ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాకు మరో ప్లస్ సిద్ శ్రీరామ్ పాడిన పాట.. ప్రేక్షకులను మరోసారి మంత్రముగ్ధులను చేసింది. అలాగే నేపథ్య సంగీతం కూడా కొన్ని సన్నివేశాల్లో ఇంటెన్సిటీని పెంచడానికి ట్రై చేశాడు సాగర్. శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. మలయాళ ‘ఇష్క్’ నుంచి ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశాడు. మొత్తానికి ఇష్క్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు తేజా సజ్జా.

Also Read: Amala Akkineni: బ్లూక్రాస్ సంస్థ పై వస్తున్న వార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన చైర్ పర్సన్ అమల..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!