AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం.. దీనస్థితిలో చిన్నారి పెళ్లి కూతురు నటి పేరెంట్స్..

Pratyusha Banerjee: బాలికా వధు.. (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం.. దీనస్థితిలో చిన్నారి పెళ్లి కూతురు నటి పేరెంట్స్..
Pratyusha Banerjee
Rajitha Chanti
|

Updated on: Jul 30, 2021 | 5:47 PM

Share

Pratyusha Banerjee: బాలికా వధు.. (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నేళ్ల పాటు బుల్లితెరపై ఈ సీరియల్ హావా కొనసాగింది. బాలికా వధు సిరీయల్‏తోపాటే.. అందులో నటించిన నటీనటుల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా.. అందులోని తారలకు అభిమాలయ్యారు. ఈ సీరియల్ ద్వారా కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ వలన తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని.. ప్రత్యూష తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అప్పటి నుంచి తమ కూతురి మరణంపై న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ కుమార్తెతోపాటే.. తమ ఐశ్వర్యం పోయిందని..ప్రత్యూష చనిపోయిన తర్వాత అన్ని పొగొట్టుకున్నామని.. ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నామని ప్రత్యూష తల్లిదండ్రులు చెప్పారు. ప్రస్తుతం సింగిల్ రూమ్ ఉన్న ఇంటికి మారామని.. రోజు వారి జీవితం గడవడం కష్టంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రత్యూష తల్లిదండ్రులు మాట్లాడుతూ..మా కూమార్తె మరణం తర్వాత భయంకరమైన తుఫాను వచ్చి ..మా సర్వస్వం లాక్కెళ్లింది. మా కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తులను పోగోట్టుకున్నాం. ఇప్పుడు మా దగ్గర చిల్లి గవ్వ లేదు. నేను చైల్డ్ కేర్ సెంటర్‏లో పనిచేస్తుండగా.. మా హస్బెండ్ కథలు రాస్తూ పొట్ట పోసుకుంటున్నా్ం. ప్రస్తుతం కేవలం ఒక్క గది ఉన్న ఇంటిలోనే నివసిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు ప్రత్యూష తల్లి. 2016లో ముంబైలోని తన అపార్ట్‏మెంట్‏లో ప్రత్యూష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనక తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ హస్తముందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రాహుల్ రాజ్ సింగ్ .. మూడు నెలలో బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం నటి సలోని శర్మను వివాహం చేసుకున్నాడు.

Also Read: Jr.NTR: తహశీల్దార్ ఆఫీస్‏లో జూనియర్ ఎన్టీఆర్ సందడి.. రావడానికి పెద్ద కారణమే ఉందట..

Pawan Kalyan – Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి జనసేనాని పవన్ కళ్యాణ్ లేఖ