Money Tips: ప్రతీ నెలా రూ. 1000 ఆదా చేస్తే.. రూ. 26 లక్షలు పొందొచ్చు.. ఎలాగంటే!
PPF Scheme: సురక్షితమైన భవిష్యత్తులో సరైన పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. తద్వారా మీకు అవసరమైన సమయాల్లో డబ్బులు సమకూరే...
సురక్షితమైన భవిష్యత్తులో సరైన పథకంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. తద్వారా మీకు అవసరమైన సమయాల్లో డబ్బులు సమకూరే అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పధకాలు, ఫండ్స్ వైపు చాలామంది దృష్టి సారిస్తుంటారు. అలాంటి పెట్టుబడి మార్గాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పథకం. 1968వ సంవత్సరంలో నేషనల్ సేవింగ్స్ ఆర్గనైజేషన్ పీపీఎఫ్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
చిన్న చిన్న పొదుపులను లాభదాయకమైన పెట్టుబడిగా మార్చడం ఈ స్కీం ప్రత్యేకత. మీరు ఈ స్కీం మెచ్యూరిటీ కాలాన్ని తెలివిగా ఎంచుకుంటే, దీర్ఘకాలిక పీపీఎఫ్ చాలా మంచి రాబడిని ఇస్తుంది.ఇందులో, మీరు ప్రతి నెలా కేవలం వెయ్యి రూపాయలు ఆదా చేయడం ద్వారా రూ. 26 లక్షల వరకు మొత్తాన్ని పొందవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రతీ సంవత్సరం కనీసం రూ .500 గరిష్టంగా రూ .1.5 లక్షలు వరకు పీపీఎఫ్ ఖాతాలో జమ చేయవచ్చు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. ఆ తర్వాత మీరు మీ మొత్తం డబ్బును ఉపసంహరించుకోవచ్చు లేదా 5 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది.
15 సంవత్సరాలు పెట్టుబడి పెట్టండి…
15 ఏళ్లుగా ప్రతి నెలా రూ .1,000 డిపాజిట్ చేస్తూ ఉంటే, మీరు రూ .1.80 లక్షలు జమ చేస్తారు. వడ్డీ 7.1 శాతాన్ని కలుపుకుని మెచ్యూరిటీ సమయానికి అంటే 15 సంవత్సరాల తరువాత రూ .3.25 లక్షలు లభిస్తాయి.
26 లక్షలు ఎలా పొందాలో తెలుసుకోండి…
ప్రతీ 5 సంవత్సరాలకు పీపీఎఫ్ ఖాతాను పొడిగించే అవకాశం ఉంటుంది. పదవీ విరమణ సమయానికి మీకు మంచి మొత్తంలో డబ్బులు సమకూరాలంటే.. పీపీఎఫ్ అకౌంట్‌ను పొడిగించుకుంటూ పోవాలి. సరిగ్గా 40వ సంవత్సరం నాటికి మీ డబ్బు భారీగా పెరుగుతుంది. మీ ఖాతాలోని డబ్బు రూ .26.32 లక్షలకు పెరుగుతుంది. ఈ విధంగా, మీరు 20 సంవత్సరాల వయస్సులో పీపీఎఫ్ స్కీంలో చేరి 1000 రూపాయల పెట్టుబడిని పెట్టడం ప్రారంభిస్తే.. పదవీ విరమణ సమయానికి రూ .26.32 లక్షలు పొందవచ్చు.
ఖాతాను ప్రారంభించడం ఇలా..
ఏ పోస్టాఫీసు లేదా బ్యాంకులోనైనా పీపీఎఫ్ ఖాతా తెరవచ్చు. దీనిని మీ పేరు మీద లేదా మైనర్ కోసం గార్డియన్‌గా తీసుకోవచ్చు. ఈ పీపీఎఫ్‌లో ఉమ్మడి ఖాతా సౌకర్యం అందుబాటులో లేదు. మీరు నామినీగా ఎవరినైనా పెట్టుకోవచ్చు.
Also Read:
14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!
ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ధోని శిష్యుడు మాత్రమే.. తెగేసి చెప్పిన మాజీ క్రికెటర్..
ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!