Viral Video: భారీ నాగుపామును ఒట్టి చేతులతో ఇట్టే పట్టేసిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్!

Viral Video: పాము, కొండచిలువ లాంటి పేర్లు వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. అలాంటిది ఆ పాము రూమ్‌లో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత

Viral Video: భారీ నాగుపామును ఒట్టి చేతులతో ఇట్టే పట్టేసిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్!
Python
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2021 | 7:43 PM

పాము, కొండచిలువ లాంటి పేర్లు వింటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. అలాంటిది ఆ పాము రూమ్‌లో కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె ఆగినంత పనవుతుంది. కొంతమందికి పాములంటే చచ్చేంత భయం. మరికొంతమంది ఆ పాములతోనే విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యువతి ఒట్టి చేతులతో భారీ సైజ్ కింగ్ కోబ్రాను పట్టుకుంది. అది చూసిన తర్వాత మీరు అసలు నమ్మలేరు.

ఓ ఇంట్లోకి దూరిన భారీ సైజ్ నాగుపామును యువతి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు వైరల్ వీడియోలో చూడవచ్చు. మొదటిగా ఆ యువతి దాని కర్ర సహాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆ విషసర్పం బుసలు కొడుతూ కాటు వేయడానికి ముందుకు దూకింది. అయితే ఆమె ఎలాగోలా దాన్ని ఒట్టి చేతులతోనే పట్టుకుని గదిలో నుంచి బయటికి తీసుకొస్తుంది.

రోడ్డుపైకి ఆ పామును తీసుకొచ్చిన తర్వాత.. దాని తలను పట్టుకునేందుకు ఎంతలా ప్రయత్నించినా.. అది ఆ యువతిపై బుసలు కొడుతూ కాటు వేయడానికి దూకుతుంది. అయితే ఆమె ఏమాత్రం భయపడలేదు. ఆ భారీ నాగుపామును పట్టుకుని గోనె సంచెలో వేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ‘మిస్టర్ మాస్టర్’ అనే ఖాతా యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా లైకులు, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read: 14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!