PM SVANidhi Loan: స్వనిధి పథకం అంటే ఏమిటి..? ఈ స్కీమ్‌ ద్వారా ఎంత మంది లబ్ది పొందారో తెలిపిన కేంద్ర మంత్రి

PM SVANidhi Loan: గత ఏడాది నుంచి కరోనా వైరస్ దెబ్బకి చాలా మంది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోవడం, ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు..

PM SVANidhi Loan: స్వనిధి పథకం అంటే ఏమిటి..? ఈ స్కీమ్‌ ద్వారా ఎంత మంది లబ్ది పొందారో తెలిపిన కేంద్ర మంత్రి
Pm Svanidhi Loan
Follow us
Subhash Goud

|

Updated on: Jul 31, 2021 | 5:49 AM

PM SVANidhi Loan: గత ఏడాది నుంచి కరోనా వైరస్ దెబ్బకి చాలా మంది గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోల్పోవడం, ఆదాయం లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ ద్వారా అర్హులైన వారికి సులభంగానే రుణాలు అందిస్తోంది. కేంద్ర సర్కార్‌ స్వనిధి యోజన స్కీమ్ కింద లబ్ధిదారులకు నేరుగానే రుణాలు అందిస్తోంది. వీధి వ్యాపారులు పీఎం స్వనిధి స్కీమ్ కింద రుణం పొందటానికి అర్హులు. రూ.10,000 వరకు రుణాన్ని సులభంగానే పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌ను 2020జూన్‌ 1న ఆత్మ నిర్భర్‌ నిధి పథకంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. జూలై 26, 2021 నాటికి 43.1 లక్షల రుణ దఖాస్తులు రాగా, వీటిలో 25.2 లక్షల రుణాలు మంజూరు కాగా, అందులో రూ. 2,243 కోట్ల రుణాలు 22.7 లక్షల మందికి పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి కౌశల్‌ కిశోర్‌ తెలిపారు.

మహారాష్ట్రలో జూలై 26, 2021 నాటికి 4.2 లక్షల రుణ దరఖాస్తు రాగా, వీటిలో 1.9 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి. అందులో 1.6లక్షల మందికి రుణాలు పంపిణీ చేసింది కేంద్రం. ఇక ముంబైలో 21.527 రుణాల దరఖాస్తులు రాగా, వీటిలో 8.526 లక్షల దరఖాస్తులకు రుణాలు మంజూరు అయ్యాయి. అందులో 6,395 మందికి రుణాలు పంపిణీ చేసింది. అలాగే పుణేలో 12,107 రుణ దరఖాస్తులు రాగా, వీటిలో 6,946 లక్షల రుణాలు మంజూరు కాగా, 6,169 దరఖాస్తుదారులకు రుణాలు పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి కౌశల్‌ కిషోర్‌ లోక్‌ సభలో లిఖిత పూర్వకంగా తెలిపారు. అయితే ఈ స్కీమ్‌ను చిరు వ్యాపారులను ఉద్దేశించి తీసుకువచ్చిన పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కేంద్రం ఇలాంటి రుణాలను మంజూరు చేస్తోంది.

స్వనిధి పథకం అంటే ఏమిటి:

* ఈ పథకం కింద రుణాలు రోడ్ సైడ్ బండి లేదా వీధి-రహదారిపై దుకాణాలను నడిపే వారికి ఇస్తారు. * పండ్లు-కూరగాయలు, లాండ్రీ, సెలూన్, పాన్ షాపులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. * ఒక అంచనా ప్రకారం, ఈ పథకం 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలను ట్రాక్ చేస్తుంది. * ఈ పథకం కింద ప్రతి వీధి విక్రేత రూ .10,000 వరకు రుణం తీసుకోవచ్చు. * ఈ మొత్తాన్ని వీధి విక్రేత 1 సంవత్సరంలోపు వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. * రుణ నిబంధనలు చాలా సులభం, హామీ అవసరం లేదు. * రుణం సకాలంలో తిరిగి చెల్లించే వారికి వార్షిక వడ్డీలో రాయితీ కూడా ఉంటుంది. * ఈ పథకం కింద జరిమానా విధించే నిబంధన లేదు.

ఇవీ కూడా చదవండి

Flights Ban Extends: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధం పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

Lok Sabha Strength: 1,000కి పెరగనున్న లోక్‌సభ మెంబర్స్ సంఖ్య? జాతీయ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్