Flights Ban Extends: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధం పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
Flights Ban Extends: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు చేపట్టడం వల్ల ప్రస్తుతం దేశంలో కరోనా..
Flights Ban Extends: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా కట్టడికి లాక్‌డౌన్, ఇతర ఆంక్షలు చేపట్టడం వల్ల ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కట్టడిలోకి వచ్చింది. దీంతో పాటు కరోనా ప్రభావం ప్రయాణాలపై పడింది. అంతర్జాతీయ విమానాలు సైతం నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా నేపధ్యంలో పరిస్థతుల దృష్ట్యా… అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. జూలై 31 తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో తాజాగా కేంద్రం ఈ ర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఆయా దేశాలతో జరిగిన ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందాల ప్రకారం నడుస్తున్న విమానాలు కూడా యథావిధిగా కొనసాగనున్నాయి. యూఎస్, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా ప్రపంచంలోని 28 దేశాలతో భారత్‌కు ఎయిర్ బబుల్ ఒప్పందముంది. అలాగే కొన్ని కార్గో విమానాలకు కూడా నిషేధం వర్తించబోదని డీజీసీఏ వెల్లడించింది.
కాగా, గతంలో దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ఆంక్షలు విధించింది కేంద్రం ప్రభుత్వం. ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చే ప్రయాణికుల ద్వారా కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత అప్రమత్తమైన విమానాలపై నిషేధం విధించారు. తాజాగా మరో నెల రోజులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
— DGCA (@DGCAIndia) July 30, 2021