India Corona Cases: దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 30, 2021 | 10:28 AM

దేశంలో కరోనా కేసుల పెరుగుదల మరోసారి టెన్షన్ రేపుతోంది. మరోసారి 40వేల పైనే రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఇక రికవరీల కంటే కొత్త కేసులే...

India Corona Cases: దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
India Corona Updates

దేశంలో కరోనా కేసుల పెరుగుదల మరోసారి టెన్షన్ రేపుతోంది. మరోసారి 40వేల పైనే రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తుంది. కొత్తగా 18,16,277 మందికి కరోనా టెస్టులు చేయగా.. 44,230 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 3,15,72,344 చేరింది. గురువారం మరో 555 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 4,23,217 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,155మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.38 శాతానికి చేరింది. గురువారం ఒక్కరోజే 42,360 మంది కోలుకోగా.. మొత్తంగా 3,07,43,972 మంది వ్యాధి బారి నుంచి బయటపడ్డారు. తాజాగా 51,83,180 మంది వ్యాక్సిన్ అందించారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసులు 45,60,33,754గా ఉన్నాయి.

  • మొత్తం కేసులు: 3,15,72,344
  • మొత్తం మరణాలు: 4,23,217
  • కోలుకున్నవారు: 3,07,43,972
  • యాక్టివ్​ కేసులు: 4,05,155

కోవిడ్ విజేతల్లో కొత్త సమస్య…

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో తల వెంట్రుకలు రాలిపోతున్న సమస్య ఎక్కువగా కనిపిస్తోందని, ఈ విషయమై తమ దగ్గరకు వచ్చే బాధితుల సంఖ్య 100% మేర పెరిగిందని  వైద్యులు చెబుతున్నారు. జుట్టు ఊడిపోతున్న సమస్యతో గతంలో తమ దగ్గరకు వారానికి నలుగురు లేక ఐదుగురు వచ్చేవారని… ఈ ఏడాది మే రెండో వారం నుంచి బాధితుల సంఖ్య రెట్టింపు అయిందని వెల్లడించారు. సాధారణంగా కొవిడ్‌-19 బాధితులు ఆ వ్యాధి నుంచి కోలుకున్న నెల తర్వాత తల వెంట్రుకలు ఊడిపోయే సమస్యతో బాధపడతారు. కొందరిలో మాత్రం కరోనాతో పోరాడుతున్నప్పుడే ఈ సమస్య కనిపించిందని వైద్యులు చెప్పారు.

Also Read: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు

 వామ్మో..! ఈ మొక్క పురుగులను తినేస్తుంది.. వీడియో చూస్తే షాకవుతారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu