Corona Virus: కరోనా తర్వాత మహిళల్లో పెరుగుతున్న సర్వికల్ కాన్సర్.. ముందుగా గుర్తిస్తే ప్రమాదం లేదంటున్న గైనకాలజిస్టులు
Corona Virus: ప్రస్తుత మనిషి జీవితం కరోనా కు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో.. కోవిడ్ మానవజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ధనిక పేద దేశాలనే తేడా లేదు..
Corona Virus: ప్రస్తుత మనిషి జీవితం కరోనా కు ముందు.. కరోనా తర్వాత అని చెప్పాల్సి వస్తుందేమో.. కోవిడ్ మానవజీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ధనిక పేద దేశాలనే తేడా లేదు.. సెలబ్రెటీల నుంచి సామాన్యులవరకూ అందరూ కరోనా బాధితులుగానే మారిపోయారు. ఎంతోమంది తమ కుటుంబస సభ్యులను, స్నేహితులను సన్నిహితులను కోల్పోయారు. చాలామంది ఆప్తులను, ఆస్తిపాస్తులను పోగొట్టుకున్నారు. ఇంకా చెప్పలంటే.. ఈ కరోనా వైరస్ మానవ జీవితంపై అత్యంత ప్రభావం చూపిస్తోంది.. చాలామందిని జీవచ్ఛవాలుగా చేసింది. ముఖ్యంగా కొరోనా ప్రభావంతో క్యాన్సర్ కేసులు ఎక్కువ నమోదవుతూన్నాయనే అనుమానాన్ని కొంతమంది వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది మహిళలు సర్వికల్ కాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయాన్నీ ప్రముఖ గైనకాలజిస్ట్ సోషల్ మీడియా ద్వారా చెబుతూ..మహిళలు తీసుకోవాలిసిన ముందు జాగ్రత్తలను తెలిపారు. కరోనా కు ముందు నెలకు మహా అయితె రెండు లేక మూడూ కాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యేవని.. ఇప్పుడు నెలకు 5 లేక 6 కేసులువోస్తున్నాయని అన్నారు. అంతేకాదు.. గత రెండు రోజులుగా తన వద్ద వైద్యం కోసం వచ్చిన మహిళల్లో సర్వికల్ కాన్సర్ లక్షణాలున్నాయని.. తెలిపారు.
మొదటి కేసు 36 ఏళ్ల మహిళ.. ,పీరియడ్స్ మద్యలో బ్లీడింగ్ కనిపిస్తుంది గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లగా.. అప్పటికే ఆ డాకర్ బాధితురాలు చెప్పిన లక్షణాలతో సర్వికల్ కాన్సర్ అని అనుమానించారు. దీంతో బయాప్సి చేయించారు. ఆ డాక్టర్ అనుమానమే నిజం అయ్యింది. బాధితురాలు సర్వికల్ కాన్సర్ స్టేజ్ 2 లో ఉంది. ఎందుకు చూపించుకోవడానికే లెట్ చేశావని డాక్టర్ అడిగిన ప్రశ్నకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రాబ్లెమ్ మేడం.. కానీ ఇంట్లో అందరూ కరోనా బారిన పడ్డారు.. ఇప్పుడిప్పువే ఫ్యామిలీ తేరుకుంటుంది అందుకనే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను నాయి చెప్పింది. అయితే ఆ బాధితురాలుతనకు ప్రాబ్లెమ్ ఎదురైన వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళివుంటే.. క్యాన్సర్ తొలిదశలోనే కనుకున్నవారు.. అపుడు ఆపరేషన్ తో సరి అయ్యేది.. కానీ ఇప్పుడు రేడియో, కేమో చేయాల్సిన స్టేజ్ కు చేరుకుంది. ఒక మరో కేసు విషయానికి వస్తే.. 65 ఏళ్ళు.. రుతుక్రమం ఆగిపోయి 15 అయింది. అయితే కరోనా సోకి తగ్గిన తరవాత ఏడాది నుంచి బ్లీడింగ్ అప్పుడప్పుడు కొద్దిగా కనిపిస్తోంది.. అయితే తనకు నీరసంగా ఉంది అందుకనే ఇలా అంటూ ఆ మహిళ వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లకుండా నెగ్లెక్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఆపరేషన్ స్టేజ్ కూడా దాటిపోయింది. దీంతో చాలామంది గైనకాలజిస్టులు సర్వికల్ కాన్సర్ పై మహిళలు అవగాహన కలిగి ఉండలని సూచిస్తున్నారు. తమకు సర్వికల్ కాన్సర్ సోకిందని తెలియని ఎంతమంది మహిళలున్నారో.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
Also Read: గర్భధారణ సమయంలో వాంతులు.. ఎసిడిటీ.. జాగ్రత్తలు తీసుకోండి ఇలా!