India Covid-19 News: ఆపన్న హస్తం.. సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు ఎన్ని దేశాలు సాయపడ్డాయో తెలుసా?

Covid-19 News: కరోనా సెకండ్ వేవ్ భారత్‌కు ఎప్పటికీ పీడగా మిగిలిపోనుంది. సెకండ్ వేవ్ కారణంగా భారత్ పెను ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. సెకండ్ వేవ్‌ను భారత్ అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజం అండగా నిలిచింది.

India Covid-19 News: ఆపన్న హస్తం.. సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు ఎన్ని దేశాలు సాయపడ్డాయో తెలుసా?
India Covid News
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 30, 2021 | 10:41 AM

India Covid-19 News: కరోనా సెకండ్ వేవ్ భారత్‌కు ఎప్పటికీ పీడకలగా మిగిలిపోనుంది. సెకండ్ వేవ్ కారణంగా భారత్ పెను ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. సెకండ్ వేవ్‌ను భారత్ అధిగమించేందుకు అంతర్జాతీయ సమాజం అండగా నిలిచింది. పలు దేశాలు తమ వంతు సాయాన్ని అందించాయి. కొన్ని చిన్న దేశాలు కూడా ఉడుతా భక్తి సాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నాయి. కొవిడ్ రోగులకు అవసరమయ్యే మందులు, పరికరాలు తదితరాలు అందించి పెద్ద మనస్సును చాటుకున్నాయి. అలా సెకండ్ వేవ్ సమయంలో భారత్‌కు ఎన్ని దేశాలు అండగా నిలిచాయో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో గురువారం (జులై 29, 2021) వెల్లడించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటి వరకు 52 దేశాల నుంచి భారత్‌కు సాయం అందింది. ఆ దేశాలు మందులు, పరికరాలను భారత్‌కు పంపి ఆపన్న హస్తం అందించినట్లు కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

అలాగే కంపోనెంట్ 1 ద్వారా 31.5 లక్షలు, కంపోనెంట్ 2 ద్వారా 4.5 లక్షల స్పుత్నిక్ వీ వ్యాక్సిన్లను ఇప్పటి వరకు భారత్ దిగుమతి చేసుకున్నట్లు మురళీధరన్ తెలిపారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో మందులు, వైద్య పరికరాల ఉత్పత్తి దేశంలో అవసరమైన స్థాయికి చేరుకునే వరకు ప్రపంచ దేశాలు సాయపడినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి, ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి, ప్రైవేట్ నుంచి ప్రైవేటుకు ఈ సాయం అందినట్లు వివరించారు. అలాగే విదేశాల్లోని ప్రవాస భారతీయుల సంఘాలు, కంపెనీలు కూడా భారత్‌కు సాయపడినట్లు వెల్లడించారు.

Also Read..

దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

వైర‌స్‌లు మ‌నుషుల‌పై ఎందుకు దాడి చేస్తున్నాయి..? మరిన్ని వైరస్‌లు దాడి చేయనున్నాయా..? సంచలన నివేదిక

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!