The Venus flytrap: వామ్మో..! ఈ మొక్క పురుగులను తినేస్తుంది… వీడియో చూస్తే షాకవుతారు

ఎటువంటి జంతువులైనా సరే, పక్షులైనా సరే, క్రిమి కీటకాలు అయినా సరే.. వాటి ఫోకస్ ఎక్కువగా ఆహారం కోసం అన్వేషణపైనే ఉంటుంది. సింహం, చిరుత...

The Venus flytrap: వామ్మో..! ఈ మొక్క పురుగులను తినేస్తుంది... వీడియో చూస్తే షాకవుతారు
The Venus Flytrap
Follow us

|

Updated on: Jul 30, 2021 | 12:39 PM

ఎటువంటి జంతువులైనా సరే, పక్షులైనా సరే, క్రిమి కీటకాలు అయినా సరే.. వాటి ఫోకస్ ఎక్కువగా ఆహారం కోసం అన్వేషణపైనే ఉంటుంది. సింహం, చిరుత వంటి పెద్ద జంతువుల వేట శైలి చాలా భిన్నంగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి అవి వెంటాడటం లేదా చాటుగా వచ్చి ఎరను పట్టడం చేస్తాయి. జంతువులు వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఒక మొక్క ఒక కీటకాన్ని తినడం మీరు ఎప్పుడైనా చూశారా? అవును, ఇంటర్నెట్‌లో అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఈ వైరల్ వీడియోలో కీటకాలను వేటాడే మొక్కలను చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.

వన్యప్రాణుల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు మంచి ఫోటో లేదా అద్భుతమైన వీడియో పొందడానికి అడవులలో గంటలు కొద్దీ సమయం గడుపుతారు. అలా చిత్రకీరించిన ఒక వీడియోలో, ఒక మొక్క కీటకాన్ని ఎలా పట్టుకుందో మీరు చూడవచ్చు. ఆకు రెండు కొనల మధ్య చిక్కుకున్న పురుగు తనను తాను కాపాడుకోలేకపోతుంది. మొక్క నెమ్మదిగా దాన్ని బలంగా బిగదీసింది. కీటకాలను తినడం ద్వారా పోషణ తీసుకునే కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాంటి ఒక మొక్క వీనస్ ఫ్లైట్రాప్. ఇది కీటకాలను  ఆహారంగా మలుచుకుంటుంది. ఈ షాకింగ్ వీడియో ‘లైఫ్ అండ్ నేచర్’ అనే పేజీ నుండి ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. నెటిజన్లు ఈ వీడియో క్లిప్‌ను బాగా లైక్‌ చేస్తున్నారు. ‘భలే విచిత్రం’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

కాగా వీనస్ ఫ్లైట్రాప్ మొక్క ఆకులు రెండు చివరి భాగాలు తలుపులా పనిచేస్తాయి. ఆకు రెండు భాగాల ఉపరితలంపై ముళ్ల లాంటి నిర్మాణం ఉంటుంది. ఏవైనా కీటకాలు వచ్చి వాలిన వెంటనే.. ఆకులు రెండు చివర్లు గట్టిగా బిగుసుకుంటాయి. పురుగు పూర్తిగా జీర్ణమైన తరువాత, ఆకు రెండు వైపులా తెరుచుకుని.. మరో కీటకం కోసం కాపు కాస్తుంది.

వీడియో వీక్షించండి:

Also Read: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు

‘మంచి చేయడమే తప్పైంది’.. ఇంటికి పిలిచి బట్టలిప్పి మరీ చితకబాదాడు