Chittoor District: ‘మంచి చేయడమే తప్పైంది’.. ఇంటికి పిలిచి బట్టలిప్పి మరీ చితకబాదాడు
చిత్తూరు జిల్లా- శాంతిపురం మండలం- శివరామపురంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి రాజశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ కొన్నాడు.
చిత్తూరు జిల్లా- శాంతిపురం మండలం- శివరామపురంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఫైనాన్స్ కంపెనీ నుంచి రాజశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ కొన్నాడు. ఇందుకు పూచీకత్తుగా అదే గ్రామానికి చెందిన ఆనందరెడ్డి అనే వ్యక్తి సంతకం చేశాడు. గత నాలుగు నెలల కాలం నుంచి ఈఎంఐలు కట్టలేదు రాజశేఖర్. దీంతో జామీనుగా ఉన్న ఆనందరెడ్డిని నిలదీసింది ఫైనాన్స్ కంపెనీ. విషయం తెలిసిన ఆనందరెడ్డి- రాజశేఖర్ తో మాట్లాడాడు. ఫైనాన్స్ కట్టడం నీ వల్ల కాకుంటే.. నేరుగా వెళ్లి ట్రాక్టర్ అప్పగించమన్నాడు. దీనిపై మాట్లాడదాం రమ్మంటూ ఆనందరెడ్డిని ఇంటికి పిలిపించిన రాజశేఖర్ ఆయనపై దారుణమైన దాడి చేశాడు. బట్టలిప్పి మరీ చితకబాదాడు.
ఆనందరెడ్డి చేసిన తప్పల్లా ఒకటే.. తాను పూచీ ఉండి ఇతగాడికి ట్రాక్టర్ ఇప్పించడమే. ట్రాక్టర్ తీస్కుని పద్ధతిగా ఈఎంఐలు కట్టాల్సిన వాడు కట్టకపోవడంతో.. ఆ ట్రాక్టరేదో ఫైనాన్స్ కంపెనీకి తిరిగి ఇచ్చేయమన్నాడంతే. అంత మాత్రం దానికే ఘోరంగా అవమానించడం మాత్రమే కాదు.. వయసులో పెద్దవాడని కూడా చూడకుండా.. చెలరేగిపోయాడితడు. ఈఎంఐ కట్టలేకుంటే ట్రాక్టర్ తిరిగి ఇవ్వమనడంలో తప్పెక్కడుందో అర్ధం కావడం లేదంటున్నాడు ఆనందరెడ్డి. తనకు ఇంతలా సాయం చేసిన మనిషిని ఏలాగోలా ఒప్పించి రాజశేఖర్ వ్యవహారం సెటిల్ చేయాలి కానీ.. ఇలా చితకబాదితే పరిస్థితేంటి.. ఇంకో సారి ఊళ్లో ఎవరైనా సాయానికొస్తారా? ఆనందరెడ్డి ఉదంతాన్ని ఉదాహరణగా చూపి భయపడి పారిపోరా.. ఊళ్లో ఇపుడిదే హాట్ టాపిక్.. ఏది ఏమైనా పాపం ఆనందరెడ్డి. సాయం చేసి.. అన్యాయంగా తన్నులు తిన్నాడు.. అడ్డం ఉంటే మనం కూడా.. ఇలా అడ్డం పడ్డం ఖాయమన్న మాట ఆ గ్రామంలో బలంగా వినిపిస్తోంది.
Also Read:రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక… సెగలు కక్కుతున్న తాడిపత్రి.. ప్రస్తుతానికి సీట్ల లెక్కలు ఇలా