Kurnool : కర్నూలు జిల్లాలో కొత్తపుంతలు తొక్కుతోన్న క్రైమ్, సహజ మరణాలనుకున్నవి సైతం హత్యలుగా మారుతోన్న వైనాలు.!
కర్నూలు జిల్లాలో క్రైమ్ కొత్తపుంతలు తొక్కుతోంది. సహజ మరణాలనుకున్నవి సైతం హత్యలుగా మారుతోన్న వైనాలు.. కేసులుగా మారుతున్న ఉదంతాలతో ఆందోళన వ్యక్తమవుతోంది...
Kurnool Crime Stories: కర్నూలు జిల్లాలో క్రైమ్ కొత్తపుంతలు తొక్కుతోంది. సహజ మరణాలనుకున్నవి సైతం హత్యలుగా మారుతోన్న వైనాలు.. కేసులుగా మారుతున్న ఉదంతాలతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, వీడియో ఆధారాలు సేకరించిన పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కి సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి మధ్య మొదటి నుంచి విభేదాలు భగ్గుమంటున్నాయి. అంతే స్థాయిలో వారి అనుచరుల మధ్య కూడా విభేదాలు కక్షలు కార్పణ్యాలు పతాక స్థాయికి చేరాయి. ఎంతగా అంటే… మామూలుగా చనిపోయిన కూడా ప్రత్యర్థులు హత్య చేసి చంపారని ఫిర్యాదు చేయడం, ఆసుపత్రిలో ఎమ్మెల్సీ చేయించడం, హత్య కేసులు పెట్టించడం వరకు పరిస్థితి వెళ్లిందంటే అర్థం చేసుకోవచ్చు. దీనికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు చూద్దాం.
ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కోడుమూరు నియోజకవర్గం లోని సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామం లో దేవ సహాయం ఇమ్మానియేల్ అనే ఇద్దరు పోటీ పడ్డారు. ఇద్దరిలో ఒకరు సుధాకర్ వర్గం మరొకరు కోట్ల హర్షవర్థన్ రెడ్డి వర్గం. ఇద్దరు కూడా వైసిపి వర్గీయులే. హోరాహోరీగా జరిగిన పోటీలో ఇమ్మానియేల్ పై దేవ సహాయం గెలిచాడు. ఎన్నికల సందర్భంగా దేవ సహాయం కి మద్దతుగా చర్చి పాస్టర్ ఉదయ్ కుమార్ ప్రేయర్ చేయించారని ఇమ్మానియేల్ వర్గం మండిపడింది. ఉదయ్ కుమార్ ర్ చ చర్చి పాస్టర్ గా ఉండటానికి వీలు లేదని హెచ్చరించింది. దీంతో దేవ సహాయం వర్గీయులు కొత్తగా చర్చి నిర్మించి అందులో ఉదయ్ కుమార్‌ని పాస్టర్‌గా చేయాలని నిర్ణయించారు 20 లక్షల వరకు వసూలు చేయాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత పాస్టర్ ఉదయ్ కుమార్ పై కొందరు దుండగులు దాడికి యత్నించారు. ఆ తర్వాత రోజు మళ్ళీ ఇమ్మానియేల్ వర్గీయులపై దాడికి ప్రయత్నం జరిగింది.
ఆ మరుసటి రోజు అంటే ఈ నెల 24న ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన అరగంట తర్వాత దేవ సహాయంకి గుండెపోటు వచ్చింది. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్ద, తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో తనకు హార్ట్ ఎటాక్ అని కూడా చెప్పారు. ట్రీట్మెంట్ ఇస్తుండగా నే దేవ సహాయం మృతిచెందాడు. రాళ్ల దాడిలో గాయపడి మృతి చెందాడని ఆసుపత్రిలో దేవ సహాయం బంధువులు ఎమ్మెల్సీ చేయించారు. ఎమ్మెల్సీ ఆధారంగా ఇమ్మానియేల్ పై ఏ వన్ గా, మరికొందరు పై హత్య కేసులు నమోదయ్యాయి. అంతటితో ఆగకుండా దేవ సహాయం బంధువులంతా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి అంతకుముందు అరెస్టు చేయాలని దీనికంతటికీ కారణం ఎమ్మెల్యే సుధాకర్ అని తిట్టిపోశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. వీడియో అధారిత ఆధారాలను సేకరించారు.
ఘర్షణ జరిగిన సమయంలో చని పోయిన సర్పంచ్ దేవ సహాయం కానీ, ఏ1 గా హత్య కేసు నమోదైన ఇమ్మానియేల్ కానీ లేనట్లు పోలీసులు వీడియో ఆధారాలు సేకరించారు. దీంతో సహజ మరణం హత్యగా ఫిర్యాదు చేయడం పట్ల కొత్తగా వచ్చిన ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఫిర్యాదు చేసిన వారి పైనే కేసులు నమోదు చేసి ఇ అరెస్టు చేశారు కోర్టు ఆదేశాలతో జైలుకు కూడా పంపించారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వారిపైన నమోదు చేసిన వారి పైన పోలీసులను ఇబ్బందులకు గురి చేసేలా ప్రవర్తించిన కఠిన చర్యలు తీసుకుంటామని నూతన ఎస్ పి సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.