Car – well – Sansational News – Karimnagar: కరీంనగర్ కారు బావిలో పడిన ఘటనలో విషాదకర అంశమే కాకుండా అత్యంత విస్తుపోయే విషయం కూడా కారుతో పాటు బయటపడింది. ఉదయం నుంచి బావిలో నుంచి కారు బయటకు తీసేందుకు పని చేస్తున్న ఫైర్ సర్వీస్ అధికారికి.. బావిలో పడ్డ కారులోంచి శవమై బయటకొచ్చిన రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్ స్వయంగా అన్న. ఆ విషయం ఉదయం నుంచి తెలీదు. కారు బయటకు తీసి శవాన్ని బయటకు లాగాక ఆయన తన అన్న అని గుర్తుపట్టారు సదరు ఫైర్ సర్వీస్ అధికారి.
ఇలా ఉండగా, కరీంనగర్ జిల్లాలో బావిలోపడ్డ కారును బయటకు తీశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 9 గంటల పాటు నాన్‌స్టాప్‌గా శ్రమించింది రెస్క్యూ టీమ్. తొలుత గజ ఈతగాళ్ల సాయంతో ప్రయత్నించారు. ఆ తర్వాత క్రేన్ల సాయంతో కారును బయటకు తీయగలిగారు. హైదరాబాద్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న కారు.. చిన్నముల్కనూర్ దగ్గర ఉదయం 11 గంటల సమయంలో బావిలోకి దూసుకెళ్లింది. ఆ వెహికల్ కొత్తకారుగా గుర్తించారు. డ్రైవర్ సీట్‌లో ఉన్న ఒకరు చనిపోయారు. అతన్ని కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లికి చెందిన రిటైర్డ్ SI పాపయ్యనాయక్‌గా గుర్తించారు.
ఈ ఉదయం బావిలోకి దూసుకెళ్లిన కారును ఎట్టకేలకు అధికారులు బయటకు తీశారు. బావిలో 60 అడుగుల మేర నీరు ఉండటంతో కారును బయటకు తీయడం అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి కష్టంగా మారింది. దాదాపు 9గంటల పాటు శ్రమించిన అధికారులు ఎట్టకేలకు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారు అద్దాలు తెరచి చూడగా.. అందులో ఒక్కరే ఉన్నట్టు గుర్తించారు. కారు కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారులో నలుగురైదుగురు ఉన్నట్టు తొలుత పోలీసులు భావించారు. చనిపోయిన పాపయ్య నాయక్‌ది భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో గల తండా స్వగ్రామం. హుస్నాబాద్ అక్కన్నపేటలో గతంలో విధులు నిర్వహించిన ఎస్సై పాపయ్య నాయక్ ఇటీవలే రిటైర్మెంట్ అయ్యారు. కరీంనగర్ నుండి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Karimnagar Car Rescue
Read also : Bharti Arora: మహిళా సీనియర్ ఐపీఎస్ సంచలన నిర్ణయం.. ఇక తన జీవితం శ్రీకృష్ణుడి సేవకు అంకితమంటూ..