Maternity Leaves: కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
Kasturba Gandhi Balika Vidyalaya: తెలంగాణ ప్రభుత్వం కాంట్రక్టు పద్దతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో
Kasturba Gandhi Balika Vidyalaya: తెలంగాణ ప్రభుత్వం కాంట్రక్టు పద్దతిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వివాహిత మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ అనుమతిచ్చింది. 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జిఓ నెం. 90 ను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రకటనను విడుదల చేసింది. అంతకుమందు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు మహిళలకు ప్రసూతి సెలవులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు.. ఆదేశాలతో కాంట్రాక్టు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీంతో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజులు సెలవులు తీసుకోవచ్చు. వారు ముందస్తుగా ఉన్నతాధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనంతరం 180 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేయనున్నారు.
Also Read: