AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harassment: అతను వృత్తికే పంతులు. బుద్ది మాత్రం పాడు బుద్ధి.. కోరిక తీరిస్తే మార్కులేస్తానంటూ అమ్మాయిలకు వేధింపులు..!

కాలేజీలు తెరవని కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తే....అక్కడ కూడా తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. స్టూడెంట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

Harassment: అతను వృత్తికే పంతులు. బుద్ది మాత్రం పాడు బుద్ధి.. కోరిక తీరిస్తే మార్కులేస్తానంటూ అమ్మాయిలకు వేధింపులు..!
Harassment
Balaraju Goud
|

Updated on: Jul 29, 2021 | 10:16 PM

Share

Private College Lecture Harassment: కాలేజీలు తెరవని కారణంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తే….అక్కడ కూడా తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. స్టూడెంట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కరోనాకు భయపడి అమ్మాయిలు కాలేజీలకు వెళ్లకపోయినా కామాంధులు మాత్రం…ఏదో రూపంలో వాళ్లను వేధిస్తూనే ఉన్నారు. అయితే వేధిస్తోంది ఏ పోకిరో…ఆకతాయో, లేక జులాయిగా తిరిగే వాడో అయితే పెద్దగా పట్టించుకోనవసరం లేదు. పాఠాలు చెప్పే టీచరే కీచకుడి అవతారమెత్తాడు.

ప్రైవేటు కళాశాలలోని అధ్యాపకుడు ఒకరు కీచకుడిలా మారాడు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట విద్యార్థిని ఫోన్‌ నెంబర్‌ తీసుకుని, వికృతంగా ప్రవర్తించాడు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదువుతున్న అమ్మాయి ఫోన్ నెంబర్ సేకరించాడు వినయ్‌రాజ్ అనే ప్రబుద్ధుడు. ఆమెకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ…నగ్నంగా ఉన్న వీడియోలు పంపమంటూ వేధించాడు. గతేడాది టెన్త్‌ క్లాస్ చదువుతుండగా బాధితురాలికి ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పాడు. ఆ పరిచయంతో ఇలా వేధించడంతో బాధితురాలు విసిగిపోయింది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

ఈ క్రమంలో ఓ విద్యార్థినితో వాట్సా్‌పలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెకు తరచూ అశ్లీల సందేశాలు పంపుతూ లైంగిక వేధింపులకు ఒడిగట్టాడు. నగ్న వీడియోలు పంపాలని, తన గదికి వచ్చి కోరిక తీర్చాలని వేధించాడు. అలా చేస్తేనే ఎక్కువ మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్‌ చేస్తానని బెదిరించాడు.అధ్యాపకుడి అగ్లీ క్యారెక్టర్ తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు…స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్‌రాజ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎవరూ చూడరు కదా అని ఇలా అన్‌లైన్‌లో…సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు పంపి వేధిస్తే…అందరూ భరిస్తారనుకుంటే పొరపాటే. ఇలాగే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి…కటకటాల వెనక్కి పంపుతారని గుర్తుంచుకోండి.

Read Also..  Hyderabad: హైదరాబాద్ లెమన్ ట్రీ హోటల్‌లో దారుణం.. ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య