ACB Raids: లంచం తీసుకుంటూ పట్టబడ్డ యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్.. గుట్ట కార్యాలయంలో కొనసాగుతన్న ఏసీబీ సోదాలు..!
తెలంగాణలో లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు.. తాజాగా యాదాద్రి జిల్లాలో మరో అవినీతి తిమిగళం చిక్కింది.
ACB Raids on Yadagirigutta Sub-Registrar: తెలంగాణలో లంచగొండి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు.. తాజాగా యాదాద్రి జిల్లాలో మరో అవినీతి తిమిగళం చిక్కింది. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఒక క్రయవిక్రయానికి సంబంధించి సబ్ రిజిస్టర్ దేవానంద్ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ద్వారా 20 వేల రూపాయలను తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
దీంతో సబ్ రిజిస్టర్ దేవానంద్‌తో సహా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లోపల ఉన్న అధికారులు, ఉద్యోగులను బయటకు వెళ్లకుండా తలుపులు బిగించి సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటగా డాక్యూమెంట్ రైటర్ వద్ద నుంచి అధికారులు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసబీ అధికారులు ఇంకా సోదాలు కొనసాగుతున్నారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also…