Minister KTR: మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి కేటీఆర్.. గిరిజన క్రీడాకారుడుకి చేయూత..

తెలంగాణ మున్నిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తన ఔదార్యాన్ని మరో సారి చాటుకున్నారు. క్రీడల్లో రాణిస్తున్న గిరిజన క్రీడాకారుడు గురించి తెలుసుకుని సాయాన్ని చేశారు

Minister KTR: మరోసారి ఔదార్యం చాటుకున్న మంత్రి కేటీఆర్.. గిరిజన క్రీడాకారుడుకి చేయూత..
Minister Ktr Helping Hand
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 29, 2021 | 5:19 PM

Minister KTR Helping Hand: తెలంగాణ మున్నిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తన ఔదార్యాన్ని మరో సారి చాటుకున్నారు. క్రీడల్లో రాణిస్తున్న గిరిజన క్రీడాకారుడు గురించి తెలుసుకుని సాయాన్ని చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజన్నసిరిసిల్ల జిల్లా రాచర్లగుండారంకు చెందిన ముడవత్ వెంకటేష్ అనే యువకుడు అంతర్జాతీయ క్రీడల్లో రాణిస్తున్నాడు. ఆర్థికంగా వెనుబడినప్పటికీ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇదిలావుంటే, ఇటీవల మంత్రి కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టాలని అభిమానులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలపునిచ్చారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకుడు ఉగ్గం రాకేష్ యాదవ్ క్రీడాకారుడు వెంకటేష్‌కు రూ.1.8 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.

వెంకటేష్ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఖోఖో పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించాడు. కోచ్ డిప్లొమ కోర్సు కోసం వెంకటేష్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జాతీయ క్రీడా సంస్థ (ఎన్ఎస్ఎన్ఐఎస్)లో సీటు సంపాదించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకటేశ్ తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మంత్రి కేటీఆర్‌ను సంప్రదించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ యూత్ నాయకుడు రాకేశ్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యువ క్రీడాకారుడిని మరింత ప్రొత్సహించేందుకు ఆర్థిక సహాయం అందజేశారు. గొప్ప మనసు చాటుకున్న రాకేశ్ యాదవ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు.

Read Also…  Meerpet: మహిళ చెంప చెల్లుమనిపించిన మేయర్ భర్త.. రేషన్ కార్డు అడిగినందుకు..