AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharti Arora: మహిళా సీనియర్‌ ఐపీఎస్‌ సంచలన నిర్ణయం.. ఇక తన జీవితం శ్రీకృష్ణుడి సేవకు అంకితమంటూ..

హర్యానాకు చెందిన ఒక సీనియర్‌ మహిళా ఐసీఎస్‌ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె, ఇక తన జీవితాన్ని శ్రీకృష్ణుడి సేవకు అంకిత చేయాలని భావించి..

Bharti Arora: మహిళా సీనియర్‌ ఐపీఎస్‌ సంచలన నిర్ణయం.. ఇక తన జీవితం శ్రీకృష్ణుడి సేవకు అంకితమంటూ..
Bharti Arora
Venkata Narayana
|

Updated on: Jul 29, 2021 | 4:54 PM

Share

Bharti Arora: హర్యానాకు చెందిన ఒక సీనియర్‌ మహిళా ఐసీఎస్‌ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇక తన జీవితాన్ని శ్రీకృష్ణుడి సేవకు అంకిత చేయాలని భావించి రిజైన్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. హర్యానా అంబాలా రేంజి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ భారతీ ఆరోనా తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్‌ ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. ఎంతో కష్టపడి సాధించిన పోలీసు ఉన్నతాధికారిణి ఉద్యోగాన్ని తృణపాయంగా వదిలేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

1998 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిని భారతీ అరోరా పోలీసు శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించి ఉత్తమ అధికారిణిగా పేరు తెచ్చకున్నారు. 2007 లో రైల్వే సూపరింటెండెంట్‌గా సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలు పేలుడు కేసును దర్యాప్తు చేశారు. హర్యానా కర్నాల్‌ రేంజీ ఐజీగా పని చేసి 2 ఏడాది ఏప్రిల్‌లో అంబాలా రేంజికి బదిలీ ఆయ్యారు. 50 ఏళ్లు దాటిన తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల ప్రకారం సర్వీసు నుంచి పదవీ విరమణ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్లు హర్యాణా చీఫ్‌ సెక్రటరీకి లేఖ రాశారు భారతీ ఆరోరా.

23 ఏళ్లు ఐపీఎస్‌గా పని చేసిన తాను ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయణించాలనుకుంటున్నానని.. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నానని తెలిపారు భారతీ అరోరా. “సాధుసంతతులు గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను.” అని ఆమె తన లేఖలో తెలిపారు. జీవిత అంతిమ లక్ష్యంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నానని వెల్లడించారు భారతీ అరోరా. ఆగస్టు 1 నుంచి అమె పదవీ విరమణ అమలులోకి రానుంది.

Read also : Bellampalli Murder: భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. బెల్లంపల్లిలో ఘోరం