Snake Bite: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. కాటేసిన పామును వెంటాడి మరి చంపాడు.. ఆ తర్వాత

snake bite: పామును చూస్తేనే మనం భయపడి పారిపోతుంటాం.. అలాంటిది ఓ బుడ్డోడు పాము కాటేసినా భయపడలేదు. దానిని వెంటపడి మరి

Snake Bite: ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. కాటేసిన పామును వెంటాడి మరి చంపాడు.. ఆ తర్వాత
Snake Bite
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 29, 2021 | 6:05 PM

Snake bite: పామును చూస్తేనే మనం భయపడి పారిపోతుంటాం.. అలాంటిది ఓ బుడ్డోడు పాము కాటేసినా భయపడలేదు. దానిని వెంటపడి మరి రాయితో కొట్టి చంపాడు. అనంతరం ఆ పామును కవర్లో వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స తీసుకొని ప్రాణాలను నిలబెట్టుకున్నాడు. ఇదంతా చేసింది ఏడేళ్ల బాలుడేనని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాము కుమారుడు దర్షిత్ (7) మూడో తరగతి చదువుతున్నాడు. ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అమ్మమ్మ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏదో పురుగు కరిచినట్లు గ్రహించాడు. వెంటనే పొలంలో వెతకగా.. రక్తపింజర జాతి విషపాము పాకుతూ కనిపించింది

వెంటనే.. పొలంలో పాము వెంటపడి రాళ్లతో కొట్టి చంపాడు. అనంతరం ఆ పామును పట్టుకుని ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. పాము కాటేసినా.. దర్షిత్‌లో ఎలాంటి మార్పు లేకపోవడంతో.. వైద్యులు రెండురోజులపాటు ఆసుపత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించింది. దీంతో ఆ బాలుడిని మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి పంపించినట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే.. ఇంటికి పంపే ముందు ఆ బాలుడితో వైద్యులు సరదాగా సంభాషించారు. ఆసుపత్రికి చచ్చిన పామును తీసుకుని ఎందుకు వచ్చావంటూ వైద్యులు ప్రశ్నించగా.. తనను ఏ పాము కాటేసిందో తెలిస్తేనే కదా.. చికిత్స అందించేది అంటూ బదులిచ్చాడు. ఈ జవాబుతో అక్కడున్న వైద్యులంతా బిత్తరపోయారు. అయితే.. ఈ సందర్భంగా వైద్యులు బాలుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ అభినందించారు.

Also Read:

Meerpet: మహిళ చెంప చెల్లుమనిపించిన మేయర్ భర్త.. రేషన్ కార్డు అడిగినందుకు..

AP Crime News: తాడేపల్లిలో ఓ ఇంట్లో నుంచి దుర్వాసన.. తాళాలు పగులగొట్టి తెరిచి చూడగా..