TIDCO Houses: 300 SFT కలిగిన టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించనున్నాం : బొత్స

300 SFT కలిగిన టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించనున్నామని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు...

TIDCO Houses: 300 SFT కలిగిన టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించనున్నాం : బొత్స
Botsa
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 29, 2021 | 8:03 PM

AP Housing – TIDCO Houses – Botsa Satyanarayana: 300 SFT కలిగిన టిడ్కో ఇళ్లను రూపాయికే లబ్ధిదారులకు అందించనున్నామని ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పేదల కోసం సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి 17 వేల కాలనీలను నిర్మిస్తున్నారని బొత్స వెల్లడించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో 1.43 లక్షల ఇళ్లను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగానే రూపాయికే లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారని బొత్స చెప్పారు. 365, 430 ఎస్‌ఎఫ్‌టీ ఉన్న ఇళ్లకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రివర్స్‌టెండరింగ్‌లో రూ.400 కోట్లు ఆదా చేశామని చెప్పిన బొత్స.. దానికి తగ్గట్టుగానే అసెంబ్లీలోనే 365, 430 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల లబ్ధిదారులు కట్టాల్సిన దాంట్లో ప్రభుత్వమే రాయితీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో, ఒక దుర్బుద్ధితో తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారని బొత్స ఆరోపించారు.

గత ప్రభుత్వం అట్టహాసంగా షేర్‌వాల్‌ టెక్నాలజీని తీసుకువచ్చి సంవత్సరకాలంలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆర్భాటం చేసి టిడ్కో హౌసింగ్‌ స్కీమ్‌ను తీసుకువచ్చిందన్న బొత్స.. 7 లక్షల ఇళ్లను కడతామని కేంద్రం నుంచి అనుమతి తీసుకువచ్చి.. 4లక్షల 54 ఇళ్లకే జీఓ విడుదల చేసి.. అందులో 3.13 లక్షల ఇళ్లను ప్రారంభించి.. అందులో 51,616 ఇళ్లను గ్రౌండ్‌ లెవల్‌ చేసి.. మిగతావి వివిధ దశల్లో ఉంచారని ఎద్దేవా చేశారు. వాటికి మౌలిక సదుపాయాలు రోడ్డు, కరెంట్, నీరు ఏవీ చేయకుండా అలానే ఉంచారని బొత్స విమర్శించారు.

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వాటన్నింటినీ పూర్తిచేసి దాంట్లోని 300 ఎస్‌ఎఫ్‌టీ గల 1.43 లక్షల ఇళ్లను రూపాయికే లబ్ధిదారుడికి అందించాలని ఆలోచన చేశారని బొత్స చెప్పుకొచ్చారు. గ్రౌండింగ్‌ లెవల్‌లో ఉన్న 51 వేల ఇళ్లను కూడా లబ్ధిదారుల అంగీకారం మేరకే క్యాన్సిల్‌ చేయడం జరిగిందన్న బొత్స.. ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని సంకల్పంతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారన్నారు.

Read also : Crime News: బెల్లంపల్లిలో ఘోరం.. భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. అటు చిత్తూరులో..