AP Corona: ఏపీలో ఆ రెండు జిల్లాల్లో తగ్గిన వైరస్ వ్యాప్తి.. నాలుగు ప్రాంతాల్లో వారం పాటు కర్ఫ్యూ!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివిటీ రేట్ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. రోజూవారి...

AP Corona: ఏపీలో ఆ రెండు జిల్లాల్లో తగ్గిన వైరస్ వ్యాప్తి.. నాలుగు ప్రాంతాల్లో వారం పాటు కర్ఫ్యూ!
Coronavirus Cases In AP
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 29, 2021 | 6:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివిటీ రేట్ ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. రోజూవారి నమోదవుతున్న కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2107 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,62,049కి చేరింది. ఇందులో 21,279 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు నిన్న 1,807 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. రికవరీలు 19,27,438కి చేరాయి. అటు బుధవారం కరోనా కారణంగా 20 మంది మరణించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఆరు మరణాలు సంభవించాయి. దీనితో రాష్ట్రంలో మరణాల సంఖ్య 13,332కి చేరింది.

కాగా, నిన్న నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 392 నమోదు కాగా, తూర్పుగోదావరిలో 316, కృష్ణలో 303, నెల్లూరులో 242, ప్రకాశం 200, గుంటూరు 193, విశాఖపట్నం 163, పశ్చిమ గోదావరి 69, అనంతపురం 61, వైఎస్సార్ కడప 58, శ్రీకాకుళం 44, కర్నూలు 38, విజయనగరం 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తూర్పుగోదావరిలోని ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూ..

తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంబాజీపేట మండలంలో రోజూ నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుపోతోంది. ఈ నేపధ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంబాజీపేట మండలంలోని మాచవరం, గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం, పుల్లేటికుర్రు గ్రామాల్లో వారం రోజుల పాటు కర్ఫ్యూను విధించారు. రేపటి నుంచి ఈ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షాపులు తెరిచేందుకు అనుమతించారు. అవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ కూడా రోడ్లపైకి రావద్దని.. ఒకవేళ వస్తే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి తప్పనిసరి అని స్పష్టం చేశారు.