AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surprise Checks: గ్రామ, వార్డు సచివాలయలు ఆకస్మికంగా సందర్శించి, రికార్డులు తనిఖీ చేస్తున్న డి‌ఐజిలు, ఎస్పీలు

ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయలను ఆకస్మికంగా..

Surprise Checks: గ్రామ, వార్డు సచివాలయలు ఆకస్మికంగా సందర్శించి, రికార్డులు తనిఖీ చేస్తున్న డి‌ఐజిలు, ఎస్పీలు
Village Secretariat
Venkata Narayana
|

Updated on: Jul 29, 2021 | 7:06 PM

Share

Surprise Checks – AP – Village and ward secretariats: ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు సచివాలయలను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను తనిఖీ చేస్తున్నారు డీఐజీ, ఎస్పీలు. మహిళా పోలీసులు క్షేత్ర స్థాయిలో అందిస్తున్న సేవలనుతో పాటు గ్రామ, వార్డు సచివాలయంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి విద్యార్హతలు, వారు అందించే సేవలను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ నుండి స్వయంగా వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.

సచివాలయాల పరిధిలో నివసించే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే వివిధ పథకాలను అర్హత కలిగిన వారికి అందించే విధంగా చేపడుతున్న చర్యలను డీజీపీ, ఎస్పీలు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా సచివాలయల పరిధిలో నివసిస్తోన్న మహిళల రక్షణకు, సైబరు నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను మహిళా పోలీసులు డిజిపి, ఎస్పీలకు వివరిస్తున్నారు.

భవిష్యత్తులో మహిళా పోలీసుల సేవలతో ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువయ్యేందుకు అవసరమైన మరిన్ని చర్యలు, కార్యచరణ చేపడతామని గ్రామ, వార్డు సచివాలయల సిబ్బందికి పోలీస్ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా వివరించారు.

Read also : Crime News: బెల్లంపల్లిలో ఘోరం.. భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. అటు చిత్తూరులో..