Srisailam dam: శ్రీశైలం డ్యాం వద్ద కనువిందు చేస్తున్న కొత్త అందాలు.. కృష్ణమ్మ పరవళ్లు చేసేందుకు పోటెత్తిన సందర్శకులు..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Jul 30, 2021 | 7:57 AM

Srisailam reservoir: ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది.

Srisailam dam: శ్రీశైలం డ్యాం వద్ద కనువిందు చేస్తున్న కొత్త అందాలు.. కృష్ణమ్మ పరవళ్లు చేసేందుకు పోటెత్తిన సందర్శకులు..
Srisailam Dam Water

Follow us on

ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా పరివాహాక ప్రాంతమంతా జలకళతో కళకళలాడుతుంది. బిరా బిరా కృష్ణమ్మ పరుగులు పెడుతు పరమశివుడికి అభిషేకిస్తోంది. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడంతో.. కొత్త అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆ నీటి సోయగం కనువిందు చేస్తోంది పర్యాటకులను..

వరదనీరు ఉధృతంగా వస్తుండంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిండింది. 10 గేట్లు ఎత్తి, నీటిని కిందకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీళ్లు.. పాలనురుగుతో శ్రీశైలంలో సుందర దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 2007 తర్వాత జూలైలో ప్రాజెక్టు పూర్తిగా నిండటం, గేట్లు ఎత్తడం ఇదే తొలిసారన్నారు అధికారులు.

కృష్ణమ్మ పరివాహాక ప్రాంతమంతా జళకళతో నిండిపోయింది. జూరాల ప్రాజెక్ట్‌ 45 గేట్లు.. ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ప్రాజెక్టు అధికారులు.తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తడంతో ..నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. ఇదే ‌ఫ్లో కొనసాగితే.. సాగర్‌ గేట్లు కూడా మరో మూడు నాలుగు రోజుల్లో తెరుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం లక్ష పైగా క్యూసెక్కులు వరద వస్తోంది.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం..

జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

ఇన్ ఫ్లో : 4,99,816 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 4,87,122 క్యూసెక్కులు.. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు

ప్రస్తుతం : 884.40 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 211.9572 టీఎంసీలు

కుడి,ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..

Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu