Repalle: అర్దరాత్రి బుగ్గైన బ్రతుకులు.. రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్.. ఆరుగురు మృతి..

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో విషాదం జరిగింది. రొయ్యల చెరువు దగ్గర కరెంట్‌ షాక్‌ తగిలి...

Repalle: అర్దరాత్రి బుగ్గైన బ్రతుకులు.. రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్.. ఆరుగురు మృతి..
Current Shock
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 30, 2021 | 8:16 AM

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో విషాదం జరిగింది. రొయ్యల చెరువు దగ్గర కరెంట్‌ షాక్‌ తగిలి ఆరుగురు మృతి చెందారు.  రొయ్యల చెరువు వద్ద కాపలాగా ఒడిశా వాసులు పని చేస్తున్నారు. నైట్‌ టైమ్‌లో చెరువు గట్టుపై కాపలా కాస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షెడ్డుపై కరెంటు తీగలు పడటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.  మృతులు రామ్మూర్తి, కిరణ్‌, మనోజ్‌. మహేంద్ర, నవీన్‌, పండబోగా గుర్తించారు. ఘటనా స్థలం వద్దకు పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. ఓ వైపు విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​తో ప్రమాదం జరిగిందని అందరూ భావిస్తుండగా… షార్ట్​ సర్క్యూట్​ కాదని విద్యుత్​ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రేకుల్‌షెడ్డులో కెమికల్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. వీటి వల్లే ప్రమాదం జరిగిందా? అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

చీరాల మండలంలో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం…10 పూరిళ్లు దగ్దం

ప్రకాశం జిల్లా చీరాల మండలం పాలిబోయినవారిపాలెంలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్​తో మంటలు చేలరేగాయి. దీనికి తోడు ఎక్కువగా గాలి రావటంతో వరుసగా ఉన్న పూరిళ్లు, గడ్డివాములకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఈపురుపాలెం ఎస్సై సుబ్బారావు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాపట్ల నుంచి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే 10 పూరిళ్లు, రెండు గడ్డివాములు, 10 తాటిచెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 25 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిపనులు చేసుకునేందుకు వెళ్లామని..ఈ ప్రమాదంతో కట్టు బట్టలతో మిగిలిపోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Also Read:  పంట దండిగా పండిదనుకుంటే, ఈ బాధలేంది సారూ..!

 మంత్రి కేటీఆర్‌ సాయం కోరిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌.. దేని కొరకు అంటే..!