Tadipatri: రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక… సెగలు కక్కుతున్న తాడిపత్రి.. ప్రస్తుతానికి సీట్ల లెక్కలు ఇలా
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో మారు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటా పోటీగా రాజకీయాలు సాగుతుండడంతో మున్సిపాలిటీలో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక కొత్త టెన్షన్....
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో మారు టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటా పోటీగా రాజకీయాలు సాగుతుండడంతో మున్సిపాలిటీలో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక కొత్త టెన్షన్‌ను పుట్టిస్తోంది. ఇప్పటికే తాడిపత్రిలో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో టీడీపీ-18 చోట్ల విజయం సాధించగా, వైసీపీ-16 స్థానాల్లో గెలుపొందింది. ఒక స్థానంలో సీపీఐ ఉనికి చాటగా, మరో చోట ఇంటిపెండెంట్ గెలిపొందారు. సీపీఐ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లతో ఇప్పటికే జేసీ ప్రభాకర్‌రెడ్డి చైర్మన్‌గా గెలిపొందిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో ఇప్పటికే సీపీఐ కౌన్సిలర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. సంఖ్యాబలం తేడా స్వల్పంగా ఉండటంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలుకుంది. దీంతో రెండో వైస్ ఛైర్మన్ ఎంపికపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం ఈ పదవుకి సంబంధించి ఎన్నిక జరగనున్నాయి. దీంతో ఎవరు నియమితులు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
అక్రమంగా ఇళ్లు కూల్చివేత విషయంలో ఇప్పటికే రాజుకున్న చిచ్చు…
ఇటీవల తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీస్ జారీ చేశారు. వారం రోజుల క్రితం మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్ కూడా ఇచ్చారు. అయితే వీరిలో టీడీపీకి సపోర్ట్ చేసిన సీపీఐ కౌన్సిలర్ కూడా ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు ప్రభాకర్‌రెడ్డి. ‘గత 30 ఏళ్లుగా వారంతా ఇక్కడ ఇళ్లు కట్టుకుని ఉంటున్నారని, నీకు కౌన్సిలర్ కావాలంటే నేనే మీ పార్టీలోకి పంపిస్తానంటూ’ కామెంట్ చేశారు జేసీ. ఇలా స్టార్టయిన మాటల యుద్దం.. విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కింది. వ్యక్తిగత దూషణలతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకుంది. దీంతో రెండో వైస్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి పరిణామాలు నెలకుంటాయో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అర్దరాత్రి బుగ్గైన బ్రతుకులు.. రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్.. ఆరుగురు మృతి..