AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car falls into well: ‘అయ్యో..! అన్నా నీవేనా’… బోరున విలపించిన తమ్ముడు… కన్నీరు పెట్టించే ఘటన

ఆయన విధి నిర్వహణలో మునిగిపోయారు. సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పనిచేశారు. వీలైనంత త్వరగా కారు బయటకు తీయాలని ప్రయత్నించారు.

Car falls into well:  'అయ్యో..! అన్నా నీవేనా'... బోరున విలపించిన తమ్ముడు... కన్నీరు పెట్టించే ఘటన
Car Fell Into Well
Ram Naramaneni
|

Updated on: Jul 30, 2021 | 8:14 AM

Share

ఆయన విధి నిర్వహణలో మునిగిపోయారు. సహాయక చర్యల్లో అవిశ్రాంతంగా పనిచేశారు. వీలైనంత త్వరగా కారు బయటకు తీయాలని ప్రయత్నించారు. కారును వ్యవసాయ బావి నుంచి తీసేందుకు మెళకువలు చెప్పారు. గజ ఈతగాళ్లకు సలహా ఇచ్చారు. సుమారుగా 9 గంటల పాటు కారు ఆచూకి కోసం ప్రయత్నించాడు. కానీ.. ఆ.. కారులో నుంచి వచ్చిన మృతదేహాం.. తన అన్నదని తెలియడంతో.. షాక్ గురయ్యారు ఫైర్ ఆఫిసర్ బుద్దయ్య నాయక్. వివరాల్లోకి వెళ్తే… కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు బావిలో కారు పడిన ఘటనలో రిటైర్డ్ ఎస్‌ఐ పాపయ్య నాయక్ మృతి చెందారు. కారు ఓన్ డ్రైవింగ్ చేస్తూ.. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్లాడు.. చిన్న ముల్కనూర్ సమీపంలో ప్రమాదవశాత్తూ వ్యవసాయ బావిలో కారు పడిపోయింది. ఈ ప్రమాదం.. గురువారం ఉదయం.. 11 గంటలకు జరిగింది.. అటు నుంచి వెళ్తున్న ప్రయాణీకులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పోలీసులు.. గజ ఈతగాళ్లు సహాయంతో ఆపరేషన్ మొదలుపెట్టారు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

ఫైర్ సిబ్బంది కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ట్యూబ్‌లు.. తాళ్లు ఇతర సామాగ్రిని ఫైర్ సిబ్బంది సమకూర్చారు. అయితే.. ఫైర్ ఆఫీసర్ బుద్దయ్య నాయక్… ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు.. పలు సూచనలు ఇచ్చారు.. కానీ.. కారులో ఉంది.. తన అన్న అని తెలియదు.. కారు బయటకు తీసిన తర్వాత.. అందులో ఉన్న మృతదేహం తన అన్నది అని తెలియడంతో బోరున విలపించారు. కారు బయటకు తీసేందుకు ఉదయం నుంచి శ్రమించిన ఫైర్ సిబ్బందిలో ఒకరైన బుద్దయ్య నాయక్ సొంత సోదరుడే మృతుడు పాపయ్య నాయక్. మృతదేహం బయటకు తీసేంతవరకు తన సొంత అన్నే కారులో ఉన్నాడన్న విషయం బుద్దయ్య నాయక్‌కు తెలియదు. దీంతో డెడ్‌బాడీని చూడగానే బుద్ధయ్య నాయక్ కుప్పకూలిపోయారు. దీంతో.. తోటి సిబ్బంది ఆయన్ను ఓదార్చారు.

(సంపత్, టీవీ9 తెలుగు, కరీంనగర్)

Also Read: అర్దరాత్రి బుగ్గైన బ్రతుకులు.. రొయ్యల చెరువు వద్ద కరెంట్ షాక్.. ఆరుగురు మృతి..

పంట దండిగా పండిదనుకుంటే, ఈ బాధలేంది సారూ..!

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..