తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అడవి జంతువుల వేట.. రూ. 30 లక్షలకు పులి చర్మం అమ్ముతూ దొరికిన స్మగ్లర్లు
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పులుల వేట కొనసాగుతోంది. పులుల అవయవాలతో స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏటూరు నాగారం దగ్గర పులిచర్మం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు...
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పులుల వేట కొనసాగుతోంది. పులుల అవయవాలతో స్మగ్లర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏటూరు నాగారం దగ్గర పులిచర్మం అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. రూ. 30 లక్షలకు పులి చర్మం అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తం దందాపై పోలీసులు కూపీగా లాగుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఏటూరునాగారం మండలం ముల్లకట్ట గోదావరి వంతెన వద్ద పులి చర్మం తరలిస్తున్న ఇరువురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
వారి వద్దనుంచి పులి చర్మంతో పాటు ద్విచక్రవాహనం, మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్ గడ్ కు చెందిన సాగర్ అనే వ్యక్తి ద్వారా పులి చర్మాన్ని వాజేడుకు చెందిన తిరుమలేష్ సేకరించాడు. చత్తీస్గడ్‌కు చెందిన సత్యం అనే వ్యక్తి సహాయంతో రూ.30లక్షలకు విక్రయించేందుకు బేరం కుదుర్చుకున్నారు.
ఈక్రమంలో గోదావరి నది మీదుగా పులి చర్మాన్ని తరలిస్తుండగా ఏటూరునాగారం పోలీసులు పట్టుకున్నారు. వారిపై అటవీ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘనతో సంబంధమున్న మిగతవారిని పట్టుకుంటామని ఎస్పీ సంగ్రాంసింగ్ తెలిపారు.
ఈ ఆపరేషన్ ఏటూరునాగారం ఏఎస్పీ గౌష్ ఆలం , ఐఎఫ్ఎస్ అధికారి శివ ఆశిష్ సింహం, స్పెషల్ ఆఫీసర్ ఏటూరునాగారం ప్రశాంత్ పాటిల్, ఏటూరునాగారం సీఐ కిరణ్, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, శ్యాం ప్రసాద్ సిబ్బంది అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: Black Hole Theory: అవునూ ఆయన ముందే చెప్పారు.. అప్పుడు చెప్పింది ఇప్పుడు నిజమైంది.. అదేంటో తెలుసా..
Fireball Video: అమెరికాలో కనిపించిన ఫైర్ బాల్స్.. ఆకాశం నుంచి దూసుకొచ్చిన నిప్పు రవ్వలు..