AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero Arya: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు

'సార్పట్ట' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్య.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా...

Hero Arya: హీరో ఆర్యపై చీటింగ్ కేసు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని జర్మనీకి చెందిన మహిళ ఫిర్యాదు
Arya
Ram Naramaneni
|

Updated on: Jul 30, 2021 | 9:20 AM

Share

‘సార్పట్ట’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆర్య.. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇంకో విశేషం ఏంటంటే… ఈ మధ్యే ఆర్య భార్య సాయేషా సైగల్​.. పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆ ఇంట ఆనందాలు విరబూశాయి.  ఈ సమయంలో ఆర్యపై జర్మనీకి చెందిన ఓ మహిళ కేసు పెట్టడం చర్చనీయాంశమైంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆర్య.. రూ.70 లక్షలు తీసుకున్నాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్​లైన్​లో కంప్లైంట్ చేసింది. తామిద్దరి మధ్య జరిగిన వాట్సాప్​ చాట్​ను కూడా సమర్పించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె కోరింది. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.

నాని ‘భలే భలే మగాడివోయ్’కు తమిళ రీమేక్​ ‘గజినికాంత్’ సినిమా షూటింగ్​లో కలుసుకున్న ఆర్య- సాయేషా లవ్‌లో పడ్డారు. 2019 మార్చి 10న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఆమె భర్తతో కలిసి ‘టెడ్డీ’ సినిమా, కన్నడలో ‘యువరత్న’ మూవీ చేసింది. అయితే సాయేషా గర్భం దాల్చిన విషయాన్ని ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆమె ప్రసవించిన తర్వాత, అది హీరో విశాల్​ చెబితేనే అందరికీ తెలిసింది.

Also Read:Chittoor District: ‘మంచి చేయడమే తప్పైంది’.. ఇంటికి పిలిచి బట్టలిప్పి మరీ చితకబాదాడు

రెండో వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక… సెగలు కక్కుతున్న తాడిపత్రి.. ప్రస్తుతానికి సీట్ల లెక్కలు ఇలా

Follow Us
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం