China: చైనా నక్కచిత్తులు..ఆర్మీలో ఇంటికి ఉద్యోగం పేరిట టిబెటన్లకు గాలం..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 30, 2021 | 10:24 PM

China: సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఉన్న చైనా.. మరో ఎత్తుగడకు తెర లేపింది. భారతదేశ సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద సైనిక విస్తరణ

China: చైనా నక్కచిత్తులు..ఆర్మీలో ఇంటికి ఉద్యోగం పేరిట టిబెటన్లకు గాలం..
China

Follow us on

China: సామ్రాజ్య విస్తరణ కాంక్షతో ఉన్న చైనా.. మరో ఎత్తుగడకు తెర లేపింది. భారతదేశ సరిహద్దుల్లో ఎల్ఏసీ వద్ద సైనిక విస్తరణ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా.. టిబెటన్లను ముగ్గులోకి లాగుతోంది కన్నింగ్ చైనా. సైన్యంలో టిబెటన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. సరిహద్దుల్లో సైన్య విస్తరణ కోసం టిబెటన్లను అధికంగా నియమించుకుంటోంది. కుటుంబానికి ఒక సైనికుడిలా చేర్చుకుంటోంది. ప్రతీ టిబెటన్ కుటుంబం నుంచి ఒక వ్యక్తిని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఏ)కు పంపడం తప్పనిసరి చేసింది చైనా. టిబెటన్ యువకులకు నిజాయితీ పరీక్ష నిర్వహించి.. అందులో సక్సెస్ అయిన వారిని సైన్యంలో నియమించుకుంటున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ముఖ్యంగా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో ఎల్ఏసీ వెంట తమ ఉనికిని బలోపేతం చేయడానికి చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. ‘టిబెట్‌కు చెందిన విశ్వసనీయ యువకులను కుటుంబానికి ఒక్కరు చొప్పున చేర్చుకునేందుకు చైనా సైన్యం కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా నియామకమైన సైనికులు.. ఎల్ఏసీలో శాశ్వతంగా నియమించబడతారు. ఎల్ఏసీలో పరిస్థితులకు తట్టుకుని ఉండేందుకు అవసరమైన శిక్షణ వారికి చైనా ఇస్తోంది. దీనికి సంబంధించి సమాచారం అందింది.’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే, టిబెటన్ యువకులకు అనేక విశ్వాస పరీక్షలు పెట్టిన తరువాతే వారిని చైనా తన సైన్యంలో చేర్చుకుంటోంది. ఈ పరీక్షల్లో ప్రధానంగా చైనీస్ భాషను నేర్చుకోవడం, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలు అంగీకరించడం, ఇతర అంశాలపై వారికి పరీక్షలు పెడుతోంది. ఇలా పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వారినే చైనా తన సైన్యంలో నియమించుకుంటోంది. చైనా ఈ ప్రయత్నాలను ఈ నెల జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇలా చేయడం ద్వారా టిబెటన్లలో చైనా పాలనకు మద్ధతు లభించడంతోపాటు.. సరిహద్దుల్లో కాపలాగా ఉండే చైనా సైనికులపై ఒత్తిడిని తగ్గించొచ్చని ఆదేశం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లడక్, అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కూడా భావిస్తోంది.

Also read:

Viral Video: ఈ పక్షి మహా ముదురు బాబోయ్.. సైలెంట్‌గా వచ్చింది.. చిప్స్ ప్యాకెట్‌ను ఎత్తుకెళ్లింది.. ఫన్నీ వీడియో మీకోసం..

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu