Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..

Hyderabad: వాటర్ సప్లయ్ పైప్‌లైన్‌కు జంక్షన్ పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని..

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..
Hmwssb
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 30, 2021 | 8:52 PM

Hyderabad: వాటర్ సప్లయ్ పైప్‌లైన్‌కు జంక్షన్ పనుల కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో ట్రాక్ నుంచి చార్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. తేదీ 04/08/2021(బుధవారం) ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ 05/08/2021 గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ కారణంగా ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహింద్ర హిల్స్. 7.ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

నీటి సరఫరాలో అంతరాయం కలుగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని అధికారులు సూచించారు.