Telangana Corona: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
తెలంగాణలో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మెల్లగా పెరగుతున్నాయి. వానాకాలం సీజనల్ వ్యాధులు కూడా కరోనాకు తోడవుతున్నాయి.
Telangana Covid 19 cases Today: తెలంగాణలో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు మెల్లగా పెరగుతున్నాయి. వానాకాలం సీజనల్ వ్యాధులు కూడా కరోనాకు తోడవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,11,251 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 614 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,44,330కు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజు వ్యవధిలో నలుగురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,800 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక, గడిచిన 24 గంటల్లో 657 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈమేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 9,141 యాక్టివ్ కేసులున్నాయి. ఇక, జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 73, కరీంనగర్ 61, ఖమ్మం 47, వరంగల్ అర్బన్ 59, రంగారెడ్డి జిల్లా 30, నల్గొండ 45, మేడ్చల్ 33 చొప్పున కొత్త కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,18,93,203 నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.30.07.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/wcAVxSiye2
— IPRDepartment (@IPRTelangana) July 30, 2021
Read Also…