Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jul 30, 2021 | 9:40 PM

Cricket: కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై నిషేధం వేటు పడింది. ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, నిరోషన్

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..
Cricket

Follow us on

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు శ్రీలంక క్రికెటర్లపై నిషేధం వేటు పడింది. ధనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లాల పై ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. అలాగే ఆరు నెలల పాటు జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో ఆడటంపైనా నిషేధం విధించింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ ముగ్గురూ బయోబబుల్ రూల్స్‌ని బ్రేక్ చేశారని, ఆ కారణంగానే వీరిపై చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు వెల్లడించింది.

ఈ ముగ్గురూ ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ సందర్భంగా బయో బబుల్‌ను ఉల్లంఘించారనే కారణంతో ఇంటికి పంపించారు. అంతేకాదు.. ఈ నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో 10 మిలియన్లు(శ్రీలంక రూపాయలు) జరిమానా విధించారు. కాగా, ఈ ముగ్గురిపై నిషేధ వేటు పడుతుందని ఇప్పటికే వార్తలు రాగా.. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ వేటు కారణంగా.. ఈ ముగ్గురు క్రికెటర్లు టీ20 ప్రపంచ కప్‌కు దూరం కానున్నారు. ఇక 2022లో ఆస్ట్రేలియాలో జరిగే తదుపరి టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమ్‌లో జాయిన్ అవుతారు.

ఇదిలావుండగా.. శ్రీలంక-భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ను ఏడు వికెట్ల తేడాతో గెలచుకుంది శ్రీలంక టీమ్. నాలుగు ఓవర్లు వేసిన వనిందు హసరంగ నాలుగు వికెట్లు పడగొట్టి, తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చారు. ఈ అద్భుత ప్రదర్శనతో.. ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అందుకున్నాడు.

Also read:

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..

Husband Kills Wife: ఆవేశంలో విచక్షణ కోల్పోతున్నారు.. కడదాకా తోడుంటామంటూనే కడతేరుస్తున్నారు.. ఎందుకిలా..?

Accident: డ్రైవర్ లేకుండానే పరుగులు తీసిన ట్రాక్టర్.. 12 బైక్‌లను ధ్వంసం చేసేసింది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu