AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhoni New Look: కొత్త లుక్‌లో ధోని.. న్యూ హెయిర్ స్టైల్‌లో అదుర్స్ అనిపిస్తున్న ‘తలా’

మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. వికెట్‌ కీపర్‌గా కూడా ధోని మంచి గుర్తింపును..

Dhoni New Look: కొత్త లుక్‌లో ధోని.. న్యూ హెయిర్ స్టైల్‌లో అదుర్స్ అనిపిస్తున్న 'తలా'
Dhoni
Ravi Kiran
|

Updated on: Jul 30, 2021 | 8:39 PM

Share

మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. వికెట్‌ కీపర్‌గా కూడా ధోని మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అటు కెప్టెన్‌గా కూడా చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా పేజీలను లిఖించుకున్నాడు. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు సంపాదించి పెట్టిన ఒకే ఒక్క కెప్టెన్‌గా ఘనత సాధించాడు. ఆటలోనే కాదు.. తన ఆహార్యంలోనూ స్టైలిష్‌గా కనిపించే ధోని హెయిర్‌ స్టైల్‌ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు. ఆయన క్రికెట్‌‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్నో స్టైల్స్‌లో కనిపించాడు. ఒక్కో స్టైల్‌ అదిరిపోయేలా ఉండడంతో యువత ధోనీ స్టైల్‌ అంటూ హెయిర్‌ సెలూన్లకు పరిగెత్తుతుంటారు. ఇక తలా ఇప్పుడు మరో హెయిర్‌ స్టైల్‌తో కొత్త లుక్‌లో కనిపించాడు.

సెలబ్రిటీల స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందిన ఆలిమ్‌ హకీమ్‌ ధోనీకి సరికొత్త లుక్‌ ఇచ్చాడు. ప్రత్యేక హెయిర్‌ స్టైల్‌ చేసి న్యూలుక్‌లో మెరిసేలా తయారుచేశాడు. ఈ లుక్‌ను ఫంకీ హెయిర్‌ స్టైల్‌ అంటారట. ఈ లుక్‌ కుర్రకారును తెగ ఆకర్షిస్తోంది. ఫొటోలను ఆలిమ్‌ హకీమ్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. నెటిజన్లను వాటిని విపరీతంగా ఇష్టపడుతున్నారు. పాతికేళ్ల కుర్రాడిలా ధోని కనిపిస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: 

14 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్.. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డ సన్‌రైజర్స్ ఓపెనర్.!

ధైర్యమంటే ఇదేనేమో.. భారీ నాగుపాముతో యువతి సయ్యాట.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

ధావన్ స్థానాన్ని భర్తీ చేసేది ధోని శిష్యుడు మాత్రమే.. తెగేసి చెప్పిన మాజీ క్రికెటర్..

ఈ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనుక్కోండి.? కనిపెట్టలేదా.! అయితే ఈ స్టోరీ చదవండి!

View this post on Instagram

A post shared by Aalim Hakim (@aalimhakim)