India vs England 2021: టీమిండియాతో టెస్ట్ సిరీస్ ముందు ఇంగ్లండ్‌కు షాక్.. క్రికెట్‌కి దూరమైన ఆల్ రౌండర్
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆగస్టు 4 నుంచి నాటింగ్‌హామ్‌లో ప్రారంభం కానుంది.
India vs England 2021: భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 5 రోజుల ముందు ఇంగ్లండ్ క్రికెట్ టీంకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. శుక్రవారం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్టోక్స్ ను సిరీస్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. స్టోక్స్ కొంత కాలంపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఈసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది. మానసిక ఆరోగ్యంతోపాటు వేలి గాయం కారణంగానే ఈ సిరీస్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ 2021 సందర్భంగా క్యాచ్ అందుకునేప్పుడు స్టోక్స్ గాయపడ్డాడు. ఈ కారణంగా అతని వేలు విరిగింది. భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య టెస్ట్ సిరీస్ ఆగస్టు 4 నుంచి నాటింగక హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌తోనే రెండవ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కూడా మొదలుకానుంది.
ఈసీబీ ప్రకటన మేరకు, “స్టోక్స్ వచ్చే వారం నుంచి భారత్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండడు. తన మానసిక ఆరోగ్యంతోపాటు ఎడమ చేతి వేలికి గాయమైందని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటాడని” సోషల్ మీడియాలో ప్రకటించింది. ‘ఈసీబీ బెన్ నిర్ణయానికి పూర్తిగా మద్దతుగా ఉంది. క్రికెట్‌కు దూరంగా ఉన్న సమయంలోనూ అతనికి సహాయం చేస్తూనే ఉంటుందని’ వెల్లడించింది.
స్టోక్స్ స్థానంలో ఎవరంటే.. భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు స్టోక్స్‌తో సహా 17 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో క్రెయిగ్ ఓవర్టన్ ప్రస్తుతం ఈ జట్టులో చేరాడు.
ఐపీఎల్‌లో గాయం.. 30 ఏళ్ల బెన్ స్టోక్స్ ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్‌లో క్యాచ్ అందుకుంటూ గాయపడ్డాడు. ఈ కారణంగా అతను మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. అతను న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఆడలేకపోయాడు. అతను వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గత నెలలోనే క్రికెట్ మైదానానికి తిరిగి వచ్చాడు. ఈ నెల ప్రారంభంలో ఇంగ్లండ్ జట్టులో కరోనా కేసుల కారణంగా పాకిస్తాన్‌పై సరికొత్త జట్టుతో దిగవలసి వచ్చింది. వన్డే సిరీస్‌కు సారథ్యం వహించి జట్టును 3-0 తేడాతో గెలిపించాడు.
స్టోక్స్ కెరీర్ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడైన స్టోక్స్.. 2013 లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 71 టెస్టులు ఆడిన స్టోక్స్.. 10 సెంచరీలతో సహా 4631 పరుగులు చేసి 163 వికెట్లు (4 ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు) తీసుకున్నాడు. అంతకుముందు 2011 లో, అతను ఐర్లాండ్‌తో వన్డేలో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది వెస్టిండీస్‌తో టీ20 అరంగేట్రం చేశాడు. వన్డేల్లో 101 మ్యాచ్‌లలో 2871 పరుగులు (3 సెంచరీలు), 74 వికెట్లు పడగొట్టాడు. 2019 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను టైటిల్‌కు చేరవేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను 34 టీ20 లు ఆడిన స్టోక్స.. 19 వికెట్లు, 442 పరుగులు సాధించాడు.
Official Statement: Ben Stokes
— England Cricket (@englandcricket) July 30, 2021
Also Read: Viral Video: కండోమ్ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి.. వీడియో వైరల్..!
Tokyo Olympics 2020 Live Updates: పతకాల కోసం బరిలోకి భారత అథ్లెట్లు.. పీవీ సింధుకు నేడు కఠిన సవాలు