ఎన్నో ఆశలతో జాతీయ జట్టులోకి అరంగేట్రం.. భారత ఆల్‌రౌండర్ దెబ్బకు కెరీర్ ముగించిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?
On This Day In Cricket: అంతర్జాతీయ స్థాయిలో తన దేశం తరపున ఆడాలని ఏ క్రీడాకారుడైనా కోరుకుంటాడు. ఇందుకోసం వారు అన్ని స్థాయిల్లో రాణిస్తూ తమను తాము నిరూపించుకునేందు కష్టపడుతుంటారు. అయితే, ఓ ఆటగాడు కూడా ఇలానే చేశారు. దేశీయ క్రికెట్‌లో పరుగుల వరద..
Happy Birthday Jimmy Cook: అంతర్జాతీయ స్థాయిలో తన దేశం తరపున ఆడాలని ఏ క్రీడాకారుడైనా కోరుకుంటాడు. ఇందుకోసం వారు అన్ని స్థాయిల్లో రాణిస్తూ తమను తాము నిరూపించుకునేందు కష్టపడుతుంటారు. అయితే, ఓ ఆటగాడు కూడా ఇలానే చేశారు. దేశీయ క్రికెట్‌లో పరుగుల వరద కురిపించాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 21 వేలకు పైగా పరుగులు, లిస్ట్ ఏలో 10వేలకు పైగా పరుగులు పూర్తి చేసి సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. టీమిండియాపై అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ, భారత బౌలర్ అతడిని మొదటి బంతికే పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌తోనే అతను కన్న కలలన్నీ నాశనమయ్యాయి.
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు చెందిన జిమ్మీ కుక్ ఈ రోజు అంటే 31, జులై 1953 న జన్మించాడు. 1992-93లో డర్బన్‌లో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా తరఫున అతను దేశవాళీ క్రికెట్‌లో రికార్డు స్థాయిలో పరుగులు చేసి, జాతీయ జట్టులో ఎంట్రీ ఇచ్చాడు. కానీ తొలి మ్యాచ్‌లో తొలి బంతిలోనే కపిల్ దేవ్ అతడిని పెవిలియన్ చేర్చాడు. కుక్ ఆడిన తొలి బంతిని సచిన్ టెండూల్కర్ క్యాచ్ అందుకున్నాడు. దీని తరువాత కుక్ మరో రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అరంగేట్ర మ్యాచ్ మొదటి బంతితోనే అతని కెరీర్ ముగిసింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కుక్ 43 పరుగులు సాధించాడు.
21 వేలకు పైగా పరుగులు, 64 సెంచరీలు కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్, స్పిన్నర్‌గా జట్టులో చేరిన జిమ్మీ కుక్.. దక్షిణాఫ్రికా తరపున కేవలం మూడు టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ 6 ఇన్నింగ్స్‌లలో అతను 17.83 సగటుతో 107 పరుగులు సాధించాడు. 4 వన్డేలలో 16.75 సగటుతో 67 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, అతని ఫస్ట్ క్లాస్ క్రికెట్ గణాంకాలను చూస్తే మాత్రం కుక్ ఆశ్చర్యపోవాల్సిందే. 270 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 50.58 సగటుతో 21,143 పరుగులు చేశాడు. ఇందులో 64 సెంచరీలు, 87 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరర్ 313 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 286 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 41.39 సగటుతో 10, 639 పరుగులు సాధించాడు. ఇందులో 24 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 177 పరుగులుగా నమోదైంది.