Tokyo Olympics 2020: 41 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా..? ఆగస్టు 1న కీలక మ్యాచ్.. పతకం కోసం తాడోపేడో తేల్చుకోనున్న హాకీ టీం
పూల్ ఏలో తమ చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జపాన్‌ను 5-3తో ఓడించిన భారత హాకీ టీం.. గ్రూప్ దశలో 4 మ్యాచ్‌లు గెలిచింది. దీంతో భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది.
Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో పతకం కోసం 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు భారత పురుషుల హాకీ జట్టు సిద్ధమైంది. కోచ్ గ్రాహం రీడ్, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు గ్రూప్ దశలో మంచి ప్రదర్శన కనబరిచింది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో 5-3తో ఆతిథ్య జపాన్‌ను ఓడించి, పూల్ ఏలో రెండవ స్థానంలో నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ టీంకు అన్ని పూల్ మ్యాచ్‌లు ముగిశాయి. దాంతో క్వార్టర్ ఫైనల్స్ లైనప్ వెల్లడైంది. భారత జట్టు 41 సంవత్సరాలలో మొదటిసారి సెమీ ఫైనల్‌లో చోటు కోసం ఆడబోతోంది. ఆగస్టు 1న గ్రేట్ బ్రిటన్‌తో తలపడనుంది. సెమీ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారింది.
ఆస్ట్రేలియా, డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో పాటు పూల్ ఏలో భారత జట్టు ఉంది. ఇందులో, ఆస్ట్రేలియాపై మాత్రమే 1-7 తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అనంతరం ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించి క్వార్టర్-ఫైనల్స్‌లో తమ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, వరుసగా 3 మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ దశలో రెండవ స్థానంలో నిలిచారు. అదే సమయంలో, బ్రిటన్ జట్టు పూల్ బీ లో మూడవ స్థానంలో నిలిచింది. దీంతో రెండు జట్లు ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌లో పోటీపడనున్నాయి. బ్రిటన్ చివరి మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ బెల్జియంతో మ్యాచును 2-2తో డ్రా చేసుకుంది.
బ్రిటన్ తో పోలిస్తే.. గ్రూప్ దశ ప్రదర్శనపై మాట్లాడుతూ.. భారత ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరుతో 5 మ్యాచుల్లో 4 గెలిచింది. భారత్ మొత్తం 14 గోల్స్ చేసింది. అందులో 7 ఆస్ట్రేలియాపై చేశారు. గ్రేట్ బ్రిటన్ 5 మ్యాచ్‌లలో 2 విజయాలు సాధించింది. భారత్, గ్రేట్ బ్రిటన్ టీంల మధ్య ఆగస్టు 1, ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు క్వార్టర్-ఫైనల్ జరగనుంది. ఈమ్యాచులు భారత్ గెలిస్తే పతకాన్ని ఖాయం చేసుకునే అవకాశం ఉంది.
క్వార్టర్ ఫైనల్స్ లైనప్.. భారత్, బ్రిటన్‌తో పాటు డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ అర్జెంటీనా పూల్ బీలో రెండవ స్థానంలో నిలిచిన జర్మనీతో తలపడుతుంది. పూల్ I లో ఆస్ట్రేలియా పూల్ బీలో నాల్గవ స్థానంలో ఉన్న నెదర్లాండ్స్‌తో పోటీపడుతుంది. మూడవ క్వార్టర్ ఫైనల్ పూల్ బీలో అగ్ర జట్టు బెల్జియం పూల్ ఏలో నాల్గవ ర్యాంక్ జట్టు స్పెయిన్ మధ్య జరగనుంది. అన్ని క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆగస్టు 1 న జరగనున్నాయి.
Viral Video: కండోమ్ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి.. వీడియో వైరల్..!