AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి.. వీడియో వైరల్‌..!

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించింది. ఆమె విజయం వెనుక కండోమ్‌ కీలక పాత్ర పోషించిందంటే మీరు నమ్ముతారా? ఈ క్రీడల్లో క్యానో స్ప్రింట్‌ అనే ఒక విభాగం కూడా ఉంది.

Viral Video: కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన క్రీడాకారిణి.. వీడియో వైరల్‌..!
Tokyo Olympics
Subhash Goud
| Edited By: Phani CH|

Updated on: Jul 31, 2021 | 8:05 AM

Share

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించింది. ఆమె విజయం వెనుక కండోమ్‌ కీలక పాత్ర పోషించిందంటే మీరు నమ్ముతారా? ఈ క్రీడల్లో క్యానో స్ప్రింట్‌ అనే ఒక విభాగం కూడా ఉంది. నీటిపై కయాకింగ్‌ చేయడమే దీని ప్రత్యేకత ప్రత్యేకత. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల జెస్సికా ఫాక్స్.. ఈ వారంలో జరిగిన క్యానో స్ప్రింట్‌ స్లాలోమ్‌ సీ1 విభాగంలో అందరిని ఓడించి స్వర్ణ పతకం సాధించుకుంది. అలాగే క్యానో స్లాలామ్‌ కె1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది. అయితే, ఇదంతా ఒక కండోమ్‌ సాయంతోనే జరిగిందని ఆమె చెబుతోంది. అందుకు సంబంధించిన వీడియోను సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

క్యానో స్ప్రింట్‌ పోటీల్లో కయాకింగ్‌ ఒకటి. సన్నగా ఉండే పడవలో కేవలం ఒకరు మాత్రమే కూర్చొని తన శక్తి సామర్థ్యాలతో సరస్సులు, లేదా నదులపై ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే, ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జెస్సికాకు అనుకోకుండా ఒక ఆటంకం ఎదురైంది. తన పడవ మరమ్మతుకు గురైంది. ఈ క్రమంలోనే దాన్ని సరి చేసేందుకు కార్బన్‌ మిశ్రమాన్ని ముందు భాగంలో గట్టిగా అదిమిపెట్టి.. తర్వాత నీటిలో అది తొలగిపోకుండా ఉండేందుకు స్మూత్‌ ఫినిషింగ్‌ కోసం కండోమ్‌ని వాడినట్టు ఆమె వెల్లడించింది. అలా తన విజయానికి ఆఖరి నిమిషంలో కండోమ్‌ ఎంతగానో ఉపయోగపడిందని ఆమె తెలిపింది. దీంతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. మరోవైపు ఆ పడవ రిపేర్‌కు సంబంధించి ఆ కండోమ్‌ని ఎలా వాడారో తెలియజేసే వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Sri Lanka Cricket Board : కరోనా నిబంధనలు ఉల్లంఘన.. ముగ్గురు క్రికెట్లర్లపై ఏడాది నిషేధం..

PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్ర యాత్ర.. పతకానికి మరో అడుగు దూరంలో తెలుగుతేజం