PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్ర యాత్ర.. పతకానికి మరో అడుగు దూరంలో తెలుగుతేజం

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌..

PV Sindhu: టోక్యో ఒలంపిక్స్‌లో కొనసాగుతున్న పీవీ సింధు జైత్ర యాత్ర.. పతకానికి మరో అడుగు దూరంలో తెలుగుతేజం
Sindhu
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2021 | 3:23 PM

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ జపాన్ కు చెందిన అకానె యామగుచి తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తెలుగు తేజం పీవీ సింధు 2-0 తేడాతో గెలుపుని సొంతం చేసుకుని పతకం ఆశలను సజీవంగా నిలుపుకుంది. మాజీ ప్రపంచ నంబర్ వన్ .. స్తుతం ప్రపంచంలో 5 వ స్థానంలో ఉన్న జపాన్ ప్లేయర్ యమగుచి పై సింధు మొదటి సెట్ లో పైచేయి సాధించింది. 13-21 తేడాతో పివి సింధు గెలిచింది. ఇక రెండో గేమ్ లో సింధు అకానె హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరు ప్రారంభం నుంచే ఆధిక్యం పొందడానికి ప్రయత్నించారు. అయితే సహనం కోల్పోయిన అకానె తప్పులు చేయడంతో సింధు తనదైనశైలిలో విజృంభించింది రెండో సెట్ లో సింధు, అకానె మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు 22-20 తేడాతో గెలుపును సొంతం చేసుకుంది సింధు

కరోనా నిబంధనల నడుమ మొదలైన టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు మరో గెలుపుని సొంతం చేసుకుంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న పీవీ సింధు మొదటి మ్యాచ్ లో అలవోకగా నెగ్గిన ఈ స్టార్ ప్లేయర్ ..టాప్ లో నిలిచి భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ సెమీ ఫైనల్ లో అడుగు పెట్టింది.

ఒలంపిక్స్ లో ఎలాంటి సంచనాలైనా నమోదు చేసే సత్తా క్రీడాకారులకు ఉందని పలు సందర్భాల్లో రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో పీవీ సింధు క్రీడాకారుల ఉందని.. ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని.. అలవోకగా విజయం సొంతం చేసుకోవాలని క్రీడా అభిమానులు కోరుతున్నారు. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన తెలుగు తేజం సింధు ఈసారి పసిడి ని భారత్ కు తీసుకుని రావాలని సింధుకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.

Also Read:  హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో పీవీ సింధుగెలుపు.. సెమీస్ లోకి అడుగు