Tokyo Olympics 2020 Highlights: టోక్యో ఒలంపిక్స్ సెమీస్‌లో పోరాడి ఓడిన పీవీ సింధు..
Tokyo Olympics 2020 Highlights: టోక్యో ఒలంపిక్స్ 9 రోజున భారత్ కు మిశ్రమ ఫలితాలు వెలువడుతున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న..
Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్ 9 రోజున భారత్ కు మిశ్రమ ఫలితాలు వెలువడుతున్నాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు 4-3 తేడాతో గెలిచింది. మొదటి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఇరుజట్లు 2-2 గోల్స్ తో థర్డ్ క్వార్టర్ లో 3-3తో సమానంగా ఉన్నాయి. ఫోర్త్ క్వార్టర్ లో వందనా కటారియా మరోసారి గోల్ చేయడంతో భారత్ 4 గోల్స్ ను సాధించింది. దీంతో 4-3 తో లీడ్ ను సొంతం చేసుకుంది.
పతకాలు తెస్తారనుకున్న అతను దాస్, అమిత్ ఓటమి పాలవ్వగా.. డిస్కస్ త్రో విభాగంలో సంచలన విజయం నమోదయ్యింది.
ఈ రోజు రియో ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ ఆడనుంది. అలాగే బాక్సర్ అమిత్ పంగల్‌పై కూడా చాలా ఆశలు ఉన్నాయి. భారతదేశం పతకం ఆశించిన అతిపెద్ద పతక ఆశావహులలో అమిత్ ఒకరు. ఆర్చరీలో అతాను దాస్ క్వార్టర్‌ఫైనల్స్‌లో పాల్గొంటాడు. పతకాన్ని కూడా గెలుచుకుంటాడని అంచనాలు ఉన్నాయి.
షూటింగ్‌లో కూడా అంజుమ్ మోడ్గిల్, తేజస్విని సావంత్ ఈ రేంజ్‌లో అడుగుపెడతారు. అత్యంత ముఖ్యమైన మహిళల హాకీ జట్టు మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈ రోజు ఐర్లాండ్‌ను ఓడించిన జట్టు తన క్వార్టర్ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. శనివారం మరో విజయంపై హాకీ మహిళలు దృష్టి పెట్టారు.
అటు టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు ఓటమిపాలైంది. సెమీస్ పోరులో వరల్డ్ నెంబర్ 1 చైనా ప్లేయర్ తైజూయింగ్ చేతిలో వరుస సెట్లలో సింధు ఓడిపోయింది. సింధుపై 21-18, 21-12 తేడాతో తైజూయింగ్ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. దీనితో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతాకం ఆశలు గల్లంతయ్యాయి. ఇక కాంస్య పతకం కోసం సింధు చైనా షట్లర్ పింగ్ జియావోతో తలబడుతుంది.
LIVE NEWS & UPDATES
-
టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో సింధు ఓటమి.. కాంస్య పతకం ఆశలు సజీవం..
టోక్యో ఒలింపిక్స్ సెమీఫైనల్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు ఓటమిపాలైంది. సెమీస్ పోరులో వరల్డ్ నెంబర్ 1 చైనా ప్లేయర్ తైజూయింగ్ చేతిలో వరుస సెట్లలో సింధు ఓడిపోయింది. సింధుపై 21-18, 21-12 తేడాతో తైజూయింగ్ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. దీనితో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతాకం ఆశలు గల్లంతయ్యాయి. ఇక కాంస్య పతకం కోసం సింధు చైనా షట్లర్ పింగ్ జియావోతో తలబడుతుంది.
-
టోక్యో ఒలంపిక్స్‌లో ముగిసిన బాక్సర్ పూజారాణి ప్రయాణం. క్వార్టర్‌లో ఓటమి
టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా సాగిన పూజారాణి ప్రయాణం క్వార్టర్ ఫైనల్ లో ముగిసింది. మహిళల (69-75 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీ చేతిలో పూజారాణి ఓటమి పాలయ్యింది. క్వియాన్ లీ ని పూజారాణి ఒక్కసారి కూడా ప్రతిఘటించకుండా ఓటమి పాలైంది.
-
-
మొదటి రౌండ్‌లో ఓడిన భారత బాక్సర్ పూజా రాణి
టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా సాగుతుంది పూజారాణి. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న బాక్సర్ పూజా రాణి తన మహిళల (69-75 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీతో తలపడుతుంది. మహిళల మిడిల్ వెయిట్ (75 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీతో భారత పూజా రాణి మొదటి రౌండ్ 0-5తో ఓడిపోయింది.
-
కాసేపట్లో బాక్సర్ పూజారాణి క్వార్టర్ ఫైనల్
టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా సాగుతుంది పూజారాణి. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న బాక్సర్ పూజా రాణి తన మహిళల (69-75 కేజీలు) విభాగంలో క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన క్వియాన్ లీతో తలపడుతుంది
-
స్టార్ షట్లర్ తై జూ యింగ్‌తో తలపడనున్న పీవీ సింధు
టోక్యో ఒలంపిక్స్ 2021 తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. ఈరోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు సెమీస్ లో చైనీస్ తైపీ కి చెందిన స్టార్ షట్లర్ తై జూ యింగ్ తో తలపడనుంది.
-
-
టోక్యో ఒలింపిక్స్‌లో టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో సంచలనం..
టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ టెన్నిస్‌లో సంచలనం నమోదయ్యింది. ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌ని పాబ్లో కారెనో బస్టా ఓడించాడు. జకోవిచ్ పై గెలుపుతో బస్టా కాంస్య పతకం అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బస్టా 6-3, 6-7 (8/6), 6-3తో గెలిచాడు.
-
టోక్యో ఒలంపిక్స్‌లో నిరాశపరచిన భారత షూటర్లు..
టోక్యో ఒలంపిక్స్ 2021 లో భారత షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. శనివారం ఉదయం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్ ను కూడా దాటలేకపోయారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో అంజుమ్ ముద్గిల్, తేజస్విని సావంత్‌లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. అంజుమ్ క్వాలిఫయింగ్ రౌండ్ లో 1167 స్కోర్ చేసి 15వ స్థానంలో నిలిచింది. 2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అంజుమ్ ఒలింపిక్స్ లో మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. మరో షూటర్ తేజస్విని 1154 స్కోర్‌తో 33వ స్థానంలో నిలిచింది. అయితే కేవలం టాప్ 8 మంది షూటర్లు మాత్రమే ఈ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.
-
కాసేపట్లో మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్.. తై జూ యింగ్‌తో తలపడనున్న పీవీ సింధు
ఎన్నో అవాంతరాల మధ్య మొదలైన టోక్యో ఒలంపిక్స్ 2021 తొమ్మిదో రోజుకి చేరుకున్నాయి. ఈరోజు భారత్ తన పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తోంది. పతకాలు వస్తాని అనుకున్న కొన్ని కీలక ఈవెంట్లలో నిరాశ ఎదురైనప్పటికీ మిగిలిన ఈవెంట్లలో అంచనాలకు మించి రాణిస్తోంది. ఎవరూ ఉహించని విధంగా మహిళల డిస్కస్ త్రోలో ఫైనల్ లో అడుగు పెట్టింది. నల్స్‌కు చేరడం బహుశా 64 మీటర్ల దూరం వరకు విసిరి టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఒలంపిక్స్ ఫైనల్ లో అడుగు పెట్టింది. మరోవైపు మహిళా హాకీ జట్టు దక్షిణాఫ్రికా పై గెలిచి క్వర్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. ఇక వరుసగా రెండుసార్లు ఒలిపింక్స్‌లో సెమీ ఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు సెమీస్ లో చైనీస్ తైపీ కి చెందిన స్టార్ షట్లర్ తై జూ యింగ్ తో తలపడనుంది.
-
కాంస్య పతక పోరులో మొదటి సెట్‌ను కోల్పోయిన జొకోవిచ్
టెన్నిస్ స్టార్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ ఒలంపిక్స్ జైత్ర యాత్రకు చెక్ పెట్టి పసిడి పతాకానికి జెర్వేన్ అడ్డుకట్టవేశాడు.. అయితే తాజాగా జకోవిచ్ కాంస్య పతకం కోసం ఆడుతున్నాడు. పాబ్లో కారెనో బస్టా తో తలపడుతున్న జకోవిచ్ (4-6) తో మొదటి సెట్ ను కోల్పోయాడు.
-
దక్షిణాఫ్రికాపై గెలిచిన భారత మహిళా హాకీ జట్టు.. క్వార్టర్స్ ఆశలు సజీవం
టోక్యో ఒలింపిక్స్‌లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ మహిళా జట్టు 4-3 తేడాతో గెలిచింది. మొదటి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఇరుజట్లు 2-2 గోల్స్ తో థర్డ్ క్వార్టర్ లో 3-3తో సమానంగా ఉన్నాయి. ఫోర్త్ క్వార్టర్ లో వందనా కటారియా మరోసారి గోల్ చేయడంతో భారత్ 4 గోల్స్ ను సాధించింది. దీంతో 4-3 తో లీడ్ ను సొంతం చేసుకుంది.
భారత్ తరపున ఆట , 17వ నిమిషంలో వి కటారియా గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున టీసీ గ్లాస్బీ గోల్ చేసింది. అనంతరం ఇరు జట్లు నువ్వా నేనా అంటూ గెలుపుకోసం పోటీ పడ్డాయి. భారత్ లీడ్ లోకి వచ్చిన ప్రతి సారి దక్షిణాఫ్రికా జట్టు గోల్ చేసి.. సమానం చేసింది. ఫోర్ట్ క్వార్టర్ భారత్ నాలుగో గోల్ చేసింది. స్కోర్ సమానం చేయడానికి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అనేక ప్రయత్నాలు చేశారు. భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సిన మ్యాచ్ లో భారత్ మహిళా క్రీడాకారులు స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించారు. విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక భారత్ క్వార్టర్ లో అడుగు పెట్టాలంటే.. బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోవాల్సి ఉంది. అప్పుడు భారత్ క్వార్టర్స్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది.
-
థర్డ్ క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 గోల్స్
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో థర్డ్ క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. 3-3 గోల్స్ తో సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. అదే సమయంలో బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోవాల్సి ఉంది. అప్పుడు భారత్ క్వార్టర్స్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది.
-
రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఇరుజట్లు 2-2
టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఇరుజట్లు 2-2 గోల్స్ తో సమానంగా ఉన్నాయి. భారత్ తరపున ఆట , 17వ నిమిషంలో వి కటారియా గోల్స్ చేయగా.. దక్షిణాఫ్రికా తరపున టీసీ గ్లాస్బీ గోల్ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. అదే సమయంలో బ్రిటన్, ఐర్లాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ ఓడిపోవాల్సి ఉంది. అప్పుడు భారత్ క్వార్టర్స్ ఫైనల్ కు చేరుకునే అవకాశం ఉంది.
-
రెండో గోల్ చేసిన భారత్
ఆట ప్రారంభమైన నాలుగో నిమిషంలో వందనా కటారియా గోల్ చేయడంతో భారత మహిళలు దక్షిణాఫ్రికాపై ముందంజలో ఉన్నారు. మోనికా మల్లిక్ సుర్జీత్ కౌర్ మధ్య సమన్వయంతో రెండో గోల్ చేసింది.
-
విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు
టోక్యో ఒలంపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు దక్షణాఫ్రికా జట్టుతో తలపడుతుంది. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా భారత జట్టు ఈ మ్యాచ్ గెలవాల్సిందే.. ఫుల్ ఏ నుంచి భారత్ మహిళా హాకీ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది భారత జట్టు..
-
ఒలంపిక్స్ లో సంచలన విజయం నమోదు.. డిస్కస్ త్రో ఫైనల్లో అడుగు పెట్టిన కమల్‌ప్రీత్ కౌర్
టోక్యో ఒలంపిక్స్ 9 రోజున భారత్ కు మిశ్రమ ఫలితాలు వెలువడుతున్నాయి. పతకాలు తెస్తారనుకున్న అతను దాస్, అమిత్ ఓటమి పాలవ్వగా.. డిస్కస్ త్రో విభాగంలో సంచలన విజయం నమోదయ్యింది.
-
16 వ రౌండ్ లో బాక్సర్ అమిత్ ఓటమి
టోక్యో ఒలంపిక్స్ లో భారీ అంచనాలతో దిగిన అమిత్ పంఘల్ 16వ రౌండ్ నుంచి నిష్క్రమించాడు. పురుషుల బాక్సింగ్ ఫ్లై (48-52 కేజీలు) విభాగంలో అమిత్ యుబెర్జెన్ మార్టినెజ్ చేతిలో ఓడిపోయాడు. కొన్ని నిమిషాల క్రితం ఆర్చరీ విభాగంలో ఆతాను దాస్ ఓటమి పాలవ్వగా .. ఇప్పుడు అమిత్ పరాజయం పాలయ్యాడు.
-
రౌండ్ ఆఫ్ 8 లో అతాను దాస్ ఓటమి… ఒలంపిక్స్ నుంచి ఔట్
టోక్యో ఒలింపిక్స్‌లో ఆర్చరీ మెన్ సింగిల్స్ నుంచి అతాను దాస్ ఔట్. రౌండ్ ఆఫ్ 8లో జపాన్‌కు చెందిన ఫురుకవా తకహారుతో జరిగిన మ్యాచ్‌లో అతాను 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు. అతాను దాస్, పురుకవా వరసగా మూడు సెట్లలో హోరాహోరీగా తలపడి..సమానంగా నిలిచారు. అయితే నాలుగు, ఐదు సెట్లలో మాత్రం జపాన్ ప్లేయర్ పురుకవా 28, 29 పాయింట్లు సాధించగా.. భారత్ ఆర్చర్ అతాను 27,28 పాయిట్లు మాత్రమే సాధించాడు. దీంతో ఒలంపిక్స్ లో అతాను పోరు ముగిసింది.
-
ఆర్చరీ – అతను దాస్ పోరాటం కాసేపట్లో ప్రారంభం
భారత నంబర్ వన్ ఆర్చర్ అతాను దాస్ మరికొద్ది సేపట్లో బరిలోకి దిగనున్నాడు. తన ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్ మ్యాచులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఉన్న ఏకైక భారతీయ ఆర్చర్ అతాను దాస్.
-
అథ్లెటిక్స్ – కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కు చేరే అవకాశం
డిస్కస్ త్రోలో భారత ప్లేయర్ కమల్‌ప్రీత్ కౌర్ గ్రూప్ బీలో ఉంది. ఒకవేళ ఆమె 66.59 సీజన్‌లో ఉత్తమ పాయింట్లు సాధిస్తే, ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది.
-
అథ్లెటిక్స్ – బరిలోకి దిగిన సీమ పూనియా
సీమా పూనియా డిస్కస్ త్రోలో అరంగేట్రం చేసింది. ఆమె తన గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది.
-
ఒలింపిక్ రికార్డు
Today we have new 5 new mixed events @Tokyo2020 – Athletics 4×4 mixed relay, Judo mixed team, Shooting trap mixed team, Swimming 4×100 mixed medley relay and Triathlon mixed relay #innovation and #genderequality in the #Olympics“
— Kit McConnell (@kit_mcconnell) July 31, 2021
-
జులై 31 పూర్తి షెడ్యూల్
భారత అథ్లెట్ల పూర్తి షెడ్యూల్
It’s going to be an action packed day for #TeamIndia tomorrow, 31st July at #Tokyo2020
Stay tuned for updates and keep encouraging your favourite athletes with #Cheer4India messages pic.twitter.com/mOOGdVi2tJ
— SAIMedia (@Media_SAI) July 30, 2021
-
9వ రోజు పోటీలకు స్వాగతం
నేడు ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు తొమ్మిదవ రోజు బరిలోకి దిగనున్నారు. మీరాబాయి చాను దేశం కోసం ఒక పతకాన్ని అందించగా, శుక్రవారం బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ రెండవ పతకాన్ని అందించనుంది.
Published On - Jul 31,2021 4:57 PM