Japan Emergency: జపాన్‌లో కరోనా కల్లోలం.. ఎమర్జెన్సీ ప్రకటించిన సర్కార్.. టోక్యోతో సహా పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు
ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్ 2021లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో వేర్వేరు దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు.
Japan expands state of Emergency: ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న ఒలింపిక్స్ 2021లో ప్రాణాంతక కరోనా వైరస్ కల్లోలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో వేర్వేరు దేశాలకు చెందిన అథ్లెట్లు ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఒలింపిక్స్ నుంచి చాలా మంది ఆటగాళ్లు తప్పుకొన్నారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఒలంపిక్ నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు పూనుకున్నారు. ముఖ్యంగా టోక్యో సిటీలో ఎప్పుడూ లేనంతగా కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను నివారించడానికి జపాన్ ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ఒలింపిక్స్‌కు వేదికగా మారిన రాజధాని టోక్యో సహా పలు నగరాల్లో అత్యయిక పరిస్థితి విధించింది. ఆగస్టు 31వ తేదీ వరకు ఈ అత్యయిక పరిస్థితులను కొనసాగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి యోషిహిడె సుగా ఓ ప్రకటన విడుదల చేసింది. టోక్యో నగరంతో సహా మరో ఆరు ప్రాంతాల్లో జపాన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. టోక్యో, సైతమ, చిబ, కనగవ, ఒసాకా, ఒకినవ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ పరిస్ధితిని ప్రధాని సుగ ప్రకటించారని జపాన్ ప్రధాని కార్యాలయం శనివారం వెల్లడించింది. హొక్కైడొ, ఇషికవ, క్యోటో, హ్యోగో, ఫకుఒక ప్రాంతాలకు వైరస్ ప్రబలకుండా కఠిన చర్యలు చేపడతామని తెలిపింది. కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు నమోదవుతోన్నందున.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణాలకు దూరంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనా నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని కోరింది. మరోవైపు జపాన్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆగస్ట్ మాసాంతానికి 40 శాతం ప్రజలకు వ్యాక్సిన్ రెండు డోసులు అందించే దిశగా టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
కోవిడ్ బారినపడిన 50 ఏండ్లు పైబడిన వారు తీవ్ర లక్షణాలకు లోనుకాకుండా మెరుగైన చికిత్సను ప్రభుత్వం ఆయా రోగులకు అందుబాటులోకి తీసుకురానుందని పేర్కొంది. వైరస్ ఇన్ఫెక్షన్లను నివారించడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి అన్ని చర్యలూ చేపడతామని తెలిపింది. ప్రయాణాలు సాగించే వారు కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని, స్వస్థలానికి సురక్షితంగా చేరుకోవాలని సూచించింది.
Govt of Japan applies the declaration of a state of emergency to Tokyo, Saitama, Chiba, Kanagawa, Osaka, and Okinawa Prefectures and applies priority measures to prevent the spread of #COVID19 to Hokkaido, Ishikawa, Kyoto, Hyogo, and Fukuoka Prefectures till August 31st. pic.twitter.com/rFYCrXGpkL
— ANI (@ANI) July 31, 2021
Read Also…