PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో సింధు ఓటమి.. కాంస్య పతకం ఆశలు సజీవం..

టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు ఓటమిపాలైంది. సెమీస్ పోరులో వరల్డ్ నెంబర్‌వన్...

PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో సింధు ఓటమి.. కాంస్య పతకం ఆశలు సజీవం..
Pv Sindhu
Follow us

|

Updated on: Jul 31, 2021 | 5:32 PM

టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్‌లో తెలుగమ్మాయి పీవీ సింధు ఓటమిపాలైంది. సెమీస్ పోరులో వరల్డ్ నెంబర్‌వన్ చైనా ప్లేయర్ తైజూయింగ్ చేతిలో వరుస సెట్లలో సింధు ఓడిపోయింది. సింధుపై 21-18, 21-12 తేడాతో తైజూయింగ్ విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. దీనితో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతాకం ఆశలు గల్లంతయ్యాయి. ఇక కాంస్య పతకం కోసం రేపు(ఆదివారం) సింధు చైనా షట్లర్ బింగ్ జియావోతో తలబడుతుంది.

మ్యాచ్ ప్రారంభమైనప్పుడు సింధు ఆధిపత్యం చెలాయించింది. అయితే తొలి విరామం తర్వాత వెనుకబడిపోయింది. దీనితో అనూహ్యంగా తైజూ పుంజుకుంది. సిందుకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండా ఎటాకింగ్‌కు దిగింది. రెండు వరుస సెట్లలోనూ సింధును ఓడించింది. దీనితో భారత్‌కు స్వర్ణ పతకం ఆశలు గల్లంతయ్యాయి. అయితే కాంస్య పతకం కోసం సింధు ఆదివారం సాయంత్రం చైనా క్రీడాకారిణి బింగ్ జియావోతో తలబడనుంది. ఈ మ్యాచ్‌లో సింధు గెలిస్తే కాంస్య పతకం గ్యారంటీ..!

ఇదిలా ఉంటే తైజూ చేతుల్లో సింధు ఓడిపోవడం ఇది 14వ సారి. ఇప్పటివరకు వీరిద్దరూ 19 సార్లు తలబడితే.. సింధు కేవలం ఐదు గేమ్స్‌లో మాత్రమే విజయం సాధించింది. కాగా, శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు జపాన్ ప్లేయర్ యమగూచిపై విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. 21-13, 22-20 తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే భారీ అంచనాలతో సెమీస్‌లోకి అడుగుపెట్టిన తెలుగు తేజం సింధు అనూహ్యంగా ఓటమిని చవిచూసుంది.

సింధు ఓటమిపై స్పందించిన ఆమె తండ్రి..

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో పీవీ సింధు ఓడిపోవడంపై ఆమె తండ్రి రమణ స్పందించారు. ”వరల్డ్ ఛాంపియన్ తైజూ వ్యూహాత్మకంగా ఆడిందని.. ఎటాకింగ్‌కు దిగి ఎక్కడా కూడా సింధుకు ఛాన్స్ ఇవ్వలేదని అన్నారు. రేపటి మ్యాచ్‌లో సింధు బాగా ఆడి కాంస్య పతకం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Articles