Kamalpreet Kaur: టోక్యో ఒలంపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పంజాబీ అమ్మాయి కమల్‌ప్రీతి కౌర్..పసిడి తెచ్చేనా

Kamalpreet Kaur: టోక్యో ఒలంపిక్స్ 9వ రోజు భారత్ క్రీడాకారిణి కమల్ ప్రీత్ కౌర్ సంచలనం సృష్టించింది. కమల్‌ప్రీత్ కౌర్ మహిళల డిస్కస్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించింది...

Kamalpreet Kaur: టోక్యో ఒలంపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పంజాబీ అమ్మాయి కమల్‌ప్రీతి కౌర్..పసిడి తెచ్చేనా
Kamalpreet Kaur
Follow us
Surya Kala

|

Updated on: Aug 02, 2021 | 4:04 PM

Kamalpreet Kaur: టోక్యో ఒలంపిక్స్ 9వ రోజు భారత్ క్రీడాకారిణి కమల్ ప్రీత్ కౌర్ సంచలనం సృష్టించింది. కమల్‌ప్రీత్ కౌర్ మహిళల డిస్కస్ త్రో ఫైనల్‌కు అర్హత సాధించింది. డిస్కస్‌ త్రో విభాగంలో 64 మీటర్ల దూరం విసిరితే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. కాగా కమల్‌ప్రీత్‌ మూడో ప్రయత్నంలో సరిగ్గా 64 మీ విసిరి ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించింది. మొత్తం మూడు రౌండ్లపాటు జరిగిన డిస్కస్‌త్రోలో కమల్‌ప్రీత్‌ తొలి రౌండ్‌లో 60.29, రెండో రౌండ్‌లో 63.97, మూడో రౌండ్‌లో 64 మీ విసరడం విశేషం. రియో , లండన్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, క్రొయేషియాకు చెందిన సాండ్రా పెర్కోవిక్ 63.75 మీటర్లు విసిరింది.

దీంతో రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ ఒలింపిక్ ఛాంపియన్ సాండ్రా పెర్కోవిక్ బెస్ట్ కంటే కమల్‌ప్రీత్ దే అత్యుతమ త్రో గా నిలిచింది. కమలప్రీత్ 60.29 మీటర్ల త్రో తో ప్రారంభమైంది, రెండవసారి 63.97 తో నిలిచింది. నిజానికి ఎటువంటి అంచనాలు లేకుండా ఒలంపిక్స్ లో అడుగు పెట్టింది కమల్ ప్రీత్. పంజాబ్ లోని పాటియాలకు చెందిన 25 ఏళ్ల కమల్ ప్రీతి కౌర్ టోక్యో ఒలంపిక్స్ మైదానంలో అద్భుతం సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లో 64 మీటర్ల ఉత్తమ త్రోతో కమల్‌ప్రీత్ కౌర్ మహిళల డిస్కస్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక మహిళల డిస్కస్ ఫైనల్ ఆగస్టు 2 సోమవారం జరగనున్నది.

కమల్‌ప్రీత్ ఈ ఏడాది ప్రారంభంలో 66.59 మీటర్ల ఉత్తమ త్రో తో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. ఇది 2021 లో ప్రపంచంలో 6 వ అత్యుత్తమ త్రో గా నిలిచింది. మరోవైపు 4 సార్లు ఒలంపిక్స్ లో పాల్గొన్న సీమా పూనియా అర్హత సాధించలేకపోయింది. 60.57 మీటర్ల ఉత్తమ త్రోతో 12 వ స్థానంలో నిలిచింది.

Also Read:

Tokyo Olympics 2020 Live Updates: ఒలంపిక్స్ లో సంచలన విజయం నమోదు.. డిస్కస్‌ త్రో ఫైనల్లో కమల్‌ప్రీత్‌ కౌర్‌

చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
కొబ్బరి చెట్టు మొదలులో శివలింగం ప్రత్యక్షం !!
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
క్షుద్ర పూజలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా ??
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్నే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత