AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI: భారత్‌కి రానివ్వమంటూ బీసీసీఐ బెదిరిస్తోంది.. మాజీ దిగ్గజ క్రికెటర్ ఆరోపణలు

కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్ 2021) ఆడకుండా నన్ను వేధిస్తోందని ఓ అంతర్జాతీయ క్రికెటర్ బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) పై ఆరోపణలు గుప్పించాడు.

BCCI: భారత్‌కి రానివ్వమంటూ బీసీసీఐ బెదిరిస్తోంది.. మాజీ దిగ్గజ క్రికెటర్ ఆరోపణలు
Herschelle Gibbs
Venkata Chari
|

Updated on: Jul 31, 2021 | 12:53 PM

Share

కశ్మీర్‌ ప్రీమియర్‌ లీగ్‌ (కేపీఎల్ 2021) ఆడకుండా నన్ను వేధిస్తోందని ఓ అంతర్జాతీయ క్రికెటర్ బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్) పై ఆరోపణలు గుప్పించాడు. త్వరలో ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా మాజీ స్టార్‌ క్రికెటర్‌ హర్షలే గిబ్స్‌ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే, తన ప్రయత్నాలకు బీసీసీఐ అడ్డు పడుతోందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశాడు. ఈ లీగ్‌లో పాల్గొంటే.. భవిష్యత్తులో భారత్‌లో జరిగే టోర్నీలతోపాటు పలు కార్యక్రమాలకు ఆనుమతి ఇవ్వమంటూ బెదిరిస్తోందని పేర్కొన్నాడు. కాగా, ఈ మాజీ ఆటగాడు చేసిన ఆరోపణలపై బీసీసీఐ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. వచ్చే నెల ఆగస్టు 6 నుంచి కేపీఎల్‌ కొత్త సీజన్‌ మొదలు కానుంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఆటగాడితో పాటు లంక మాజీ ప్లేయర్ దిల్షాన్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆడేందుకు ఓకే చెప్పారు. మొత్తం ఆరు టీంలు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి.

గిబ్స్ మాట్లాడుతూ, ” కేపీఎల్‌‌ను భారత క్రికెట్ బోర్డు రాజకీయ అంశంతో రాద్దాంతం చేస్తోంది. కేపీఎల్‌లో ఆడకుండా బీసీసీఐ బెదిరిస్తోంది. మామాట కాదని కేపీఎల్ లీగ్‌లో ఆడితే.. భవిష్యత్తులో భారత్‌లో జరిగే కార్యక్రమాలకు పిలిచేది లేదంటూ హెచ్చస్తోంది. ఈ విషయంలో బీసీసీఐ అభ్యంతరం తెలపడం నాకు నచ్చలేదు’ అంటే ట్విట్టర్లో రాసుకొచ్చాడు.

గతంలో ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ కూడా కశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్ల పట్ల బీసీసీఐ అనుసరిస్తున్న విధానంపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు చేశాడు. ‘ కేపీఎల్ లీగ్‌లో పాల్గొనే ఆటగాళ్లపై బీసీసీఐ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేపీఎల్‌లో ఆడిన ప్లేయర్లను భారత్‌లోకి అనుమతించమనడం సమంజసం కాదు’ అంటూ ట్వీట్ చేశాడు.

కేపీఎల్‌ లీగ్‌లో ఓవర్సీస్‌ వారియర్స్‌, ముజఫర్‌బాద్‌ టైగర్స్‌, రావల్‌కోట్‌ హాక్స్‌, బాగ్‌ స్టాలియన్స్‌, మీర్పూర్‌ రాయల్స్‌, కోట్లీ లయన్స్‌ టీమ్‌లుగా ఆడనున్నాయి. ఆయా జట్లకు ఇమాద్‌ వసీమ్‌, మహ్మద్‌ హఫీజ్‌, షాహిద్‌ అఫ్రిది, షాబాద్‌ ఖాన్‌, షోయబ్‌ మాలిక్‌, కమ్రాన్‌ అక్మల్‌లు సారథులుగా వ్యవహరించనున్నారు.

Also Read: ఎన్నో ఆశలతో జాతీయ జట్టులోకి అరంగేట్రం.. భారత ఆల్‌రౌండర్ దెబ్బకు కెరీర్ ముగించిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?

Tokyo Olympics 2020: 41 ఏళ్ల నిరీక్షణకు తెరపడేనా..? ఆగస్టు 1న కీలక మ్యాచ్‌.. పతకం కోసం తాడోపేడో తేల్చుకోనున్న హాకీ టీం