ఇంగ్లండ్‌లో ధోని స్నేహితుడి సూపర్ ఇన్నింగ్స్.. హ్యాట్రిక్‌తో ప్రత్యర్థి నడ్డి విరిచాడు..!

ఇంగ్లండ్‌లో ఆడిన ఓవల్ టెస్టులో ఈ ఆటగాడు తన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఆటగాడితో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది.

ఇంగ్లండ్‌లో ధోని స్నేహితుడి సూపర్ ఇన్నింగ్స్.. హ్యాట్రిక్‌తో ప్రత్యర్థి నడ్డి విరిచాడు..!
Dhoni And Moeen Ali
Follow us

|

Updated on: Jul 31, 2021 | 2:11 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టు 15 న ఆయన తన రిటైర్మెంట్ ప్రకటించారు. కాగా, ధోని ఇప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ధోని జట్టులోని ఓ సహచరుడు ఇంగ్లండ్ గడ్డపై విధ్వంసం సృష్టించాడు. తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. హ్యాట్రిక్ సాధించి తన జట్టును విజయతీరాలకు చేర్చడు. ఇదే రోజు అంటే జులై 31న ఈ మ్యాచ్ ముగిసింది.

ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య ఈ మ్యాచ్ 2017లో, 27 జులై నుంచి 31 వరకు ఓవల్ మైదానంలో జరిగింది. ఇందులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 112 పరుగుల టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలస్టర్ కుక్ బ్యాట్ నుంచి 88 పరుగులు వచ్చాయి. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ జానీ బెయిర్ స్టో 36 పరుగుల సహకారం అందించాడు. మోర్నీ మోర్కెల్ దక్షిణాఫ్రికాకు అత్యంత విజయవంతమైన బౌలర్ అనండంలో సందేహం లేదు. అతను 3 వికెట్లు తీసుకున్నాడు. మరో బౌలర్ కగిసో రబాడా ఖాతాలో మూడు వికెట్లు, వెర్నాన్ ఫిలాండర్ 2 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా 175 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఇందులో టెంబా బావుమా అర్ధ సెంచరీ సాధించాడు. అతను 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బౌలర్ కగిసో రబాడా 30 పరుగులతో రాణించాడు. ఇంగ్లండ్ తరపున టోబి రోలాండ్ జోన్స్ 5 వికెట్లు తీయగా, జేమ్స్ ఆండర్సన్ 3 వికెట్లు సాధించాడు.

మొయిన్ అలీ 4 వికెట్లతో.. ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 313 పరుగులకు రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జానీ బెయిర్‌స్టో అత్యధికంగా 63 పరుగులు చేశాడు. మరో బ్యాట్సె మెన్ టామ్ వెస్ట్లీ 59 పరుగులు, కెప్టెన్ జో రూట్ 50 పరుగులు, కీటన్ జెన్నింగ్స్ 48 పరుగులు సాధించారు. బెన్ స్టోక్స్ ఈసారి 31 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికా తరపున కేశవ్ మహారాజ్ 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. ఈ దక్షిణాఫ్రికా విజయానికి 492 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే, దక్షిణాఫ్రికా జట్టు 252 పరుగులకు చేతులెత్తేసింది. దాంతో 239 పరుగుల తేడాతో ఓడిపోయింది. రెండవ ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్ 136 పరుగులు సాధించాడు. మొయిన్ అలీ హ్యాట్రిక్‌తో సహా నాలుగు వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న మొయిన్ అలీ, రెండో ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్, క్రిస్ మోరిస్, కాగిసో రబాడా, మోర్నీ మోర్కెల్ లాంటి దిగ్గజ ఆటగాళ్ల వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.

Also Read: BCCI: భారత్‌కి రానివ్వమంటూ బీసీసీఐ బెదిరిస్తోంది.. మాజీ దిగ్గజ క్రికెటర్ ఆరోపణలు

ఎన్నో ఆశలతో జాతీయ జట్టులోకి అరంగేట్రం.. భారత ఆల్‌రౌండర్ దెబ్బకు కెరీర్ ముగించిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా?

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??