India vs England: సౌతాంప్టన్‌లో టీమిండియా దిగ్గజాల ఫ్లాప్ షో.. 266 పరుగుల తేడాతో ..!
బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌలర్లు కూడా ఈ మ్యాచ్‌లో రాణించలేదు. దాంతో ఇంగ్లండ్‌తో టీమిండియా దారుణ పరాజయాన్ని చవి చూసింది.
సౌతాంప్టన్‌లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. రెండు జట్ల మధ్య జులై 27 న ప్రారంభమైన మ్యాచ్ ఈ రోజున అంటే జులై 31 న ముగిసింది. ఈ మ్యాచ్ ముగింపు మాత్రం భారత క్రికెట్ జట్టు చరిత్రలో ఓ మచ్చలా తయారైంది. టీమిండియా 266 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, ఛతేశ్వర్ పుజారా లాంటి అగ్రశ్రేణి ప్లేయర్లు కూడా తీవ్రంగా నిరాశపరిచారు. గత పది మ్యాచుల్లో ఇంగ్లండ్‌కు ఇది తొలి టెస్టు విజయం కవాడం విశేషం. అంటే, గత పది మ్యాచ్‌లలో ఇంగ్లండ్ టీం ఓడిపోవడంతోపాటు కొన్ని మ్యాచులను డ్రా చేసుకుంది. భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య ఈ మ్యాచ్ 2014లో జరిగింది.
2014వ సంవత్సరంలో జులై 27 నుంచి జులై 31 వరకు జరిగిన సౌతాంప్టన్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 569 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇయాన్ బెల్ 167 పరుగుల అద్భుతమైన సెంచరీ చేయగా, గ్యారీ బ్యాలెన్స్ కూడా 156 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇవి కాకుండా, కెప్టెన్ అలెస్టర్ కుక్ 95 పరుగులు, వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ 85 పరుగులు చేశాడు. భారత్ తరపున భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీనికి సమాధానంగా, భారత తొలి ఇన్నింగ్స్ 330 పరుగులకు పరిమితమైంది. అజింక్య రహానే అత్యధికంగా 54 పరుగులు చేయగా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్లందరూ అంచనాలను అందుకోలేకపోయారు. ఇంగ్లండ్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యం 445 పరుగులు.. 178 పరుగులకే టీమిండియా కట్టడి.. మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇందులో కెప్టెన్ అలెస్టర్ కుక్ అజేయంగా 70 పరుగులు, జో రూట్ 56 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ గెలవడానికి టీమిండియా 445 పరుగులు సాధించాలి. కానీ, టీమిండియా మొత్తం 178 పరుగులకే పెవిలియన్‌కి చేరింది. అజింక్య రహానే 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సహా ఏ ఇతర బ్యాట్స్‌మన్ కూడా అంచనాలను అందుకోలేకపోయారు. దీంతో జట్టు 266 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. మొయిన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు అత్యధికంగా 6 వికెట్లు, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు.
Also Read: ఇంగ్లండ్‌లో ధోని స్నేహితుడి సూపర్ ఇన్నింగ్స్.. హ్యాట్రిక్‌తో ప్రతర్థి నడ్డి విరిచాడు..!
BCCI: భారత్‌కి రానివ్వమంటూ బీసీసీఐ బెదిరిస్తోంది.. మాజీ దిగ్గజ క్రికెటర్ ఆరోపణలు