IND vs ENG: ‘నేను అద్భుతంగా రాణిస్తున్నానంటే అవే కారణం.. వారితో నిత్యం టచ్‌లో ఉంటా’

India vs England 2021: రిషబ్ పంత్ 2018 లో లాంగ్ సిక్స్ కొట్టడం ద్వారా టెస్ట్ మ్యాచ్‌లలో మొదటిసారిగా ఆకట్టుకున్న అదే మైదానం(ట్రెంట్‌బ్రిడ్జ్)లోనే తన 22 వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

IND vs ENG: 'నేను అద్భుతంగా రాణిస్తున్నానంటే అవే కారణం.. వారితో నిత్యం టచ్‌లో ఉంటా'
Rishabh Pant
Follow us

|

Updated on: Aug 01, 2021 | 6:58 AM

IND vs ENG: భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు లోటుపాట్లను సవరించుకుని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవల కోవిడ్ -19 నుంచి కోలుకున్న పంత్, 2018 లో లాంగ్ సిక్స్ కొట్టడం ద్వారా టెస్ట్ మ్యాచ్‌లలో మొదటిసారి ఆకట్టుకున్న అదే మైదానంలో (ట్రెంట్‌బ్రిడ్జ్) తన 22 వ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. శనివారం పంత్ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ,’ ఇది అద్భుతమైన ప్రయాణం, ఎందుకంటే నా కెరీర్ ప్రారంభంలో నేను అనేక ఒడిదొడుకులు చూశాను. తప్పులను సరిదిద్దుకుంటూ, మరింతగా మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నాను. అలాగే లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని’ అన్నాడు.

ఉత్తమ ఆటగాడిగా ఎదగడానికి అగ్రశ్రేణి క్రికెటర్లందరి నుంచి పలు టెక్నిక్‌లు నేర్చుకుంటున్నానని పంత్ పేర్కొన్నాడు. ‘రోహిత్ భాయ్‌తో నేను గత మ్యాచ్‌లో ఏమి చేశామో.. తదుపరి మ్యాచ్‌లలో ఏమి చేయగలమో లాంటి విషయాలు మాట్లాడతాను. నా ఆటకు ఇంకా ఏమి జోడించాలో నేర్చుకుంటున్నాను. నేను విరాట్ భాయ్ నుంచి టెక్నిక్స్‌ను తీసుకుంటాను. ప్రత్యేకించి ఇంగ్లండ్‌లో ఆడుతున్నప్పుడు వికెట్ ముందు, వెనుక ఆట గురించి ఎక్కువగా నేర్చుకుంటున్నాను. బాగా రాణించేందుకు ప్రతీ ఒక్కరి నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని’ పంత్ తెలిపాడు.

‘నేను రవి భాయ్ (రవిశాస్త్రి) తో కూడా ఎక్కువగా మాట్లాడతాను, ఎందుకంటే అతను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడాడు. అలాగే అష్ భాయ్ (అశ్విన్) బౌలింగ్ చేస్తున్నప్పుడు, బ్యాట్స్‌మన్ ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకు తెలుసు. బ్యాట్స్‌మన్‌గా రాణించేందుకు బౌలర్లతో కచ్చితంగా మాట్లాడతాను. వాళ్ల నుంచి కొన్ని టెక్నిక్‌లు నేర్చుకుంటాను. ఒక ఆటగాడిగా నేను అందరి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను.

పంత్ టెస్టుల్లో 43 కి పైగా సగటు.. రిషబ్ పంత్ టెస్టుల్లో 43 సగటుతో ఇప్పటివరకు 1400 పరుగులు చేశాడు. టెస్టుల్లో మూడు సెంచరీలు చేశాడు. వికెట్ వెనుక 83 వికెట్లు తీసుకున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో పంత్.. ఆస్ట్రేలియా పర్యటనలో ఆకట్టుకుని, భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్‌తో భారత్ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్‌లో కూడా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ‘ఒక క్రికెటర్‌గా, గతేడాది నుంచి ఎంతో మారిపోయాను. ప్రయత్నించకుండా ఫలితాలు రావు. ఇదే నేను ఫాలో చేస్తున్నాను. నా ఆటపై నాకు నమ్మకం ఉందని’ పేర్కొన్నాడు.

Also Read: Tokyo Olympics 2020: కాంస్య పోరులో సింధు.. కీలక మ్యాచులో పురుషుల హాకీ టీం.. ఒలింపిక్స్‌‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!

India vs England: సౌతాంప్టన్‌లో టీమిండియా దిగ్గజాల ఫ్లాప్ షో.. 266 పరుగుల తేడాతో ..!