Indian Cricket Team: టీమిండియా అరంగేట్ర బౌలర్లపై ఆసీస్ మాజీ దిగ్గజం పొగడ్తల వర్షం.. ఎందుకో తెలుసా?

భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఆడిన దాదాపు అన్ని వన్డే, టీ20 సిరీస్‌లలో ఒక భారత ఆటగాడు అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో ఇద్దరు బౌలర్లు కూడా తమ కెరీర్‌ను ప్రారంభించారు.

Indian Cricket Team: టీమిండియా అరంగేట్ర బౌలర్లపై ఆసీస్ మాజీ దిగ్గజం పొగడ్తల వర్షం.. ఎందుకో తెలుసా?
Indian Cricket Team
Follow us

|

Updated on: Aug 01, 2021 | 9:57 AM

భారత క్రికెట్‌లోని ప్రతిభావంతులైన క్రికెటర్ల గురించి కొంత కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టీమిండియా బెంచ్ ఎంతో బలంగా ఉందని పలు సందర్భాలలో వెల్లడైంది. ప్రస్తుతం టీమిండియాలోకి కొత్త కుర్రాళ్లు అరంగేట్రం చేస్తున్నారు. అలాగే వారు సత్తా చాటాతూ, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. ప్రత్యేకించి ఫాస్ట్ బౌలింగ్‌లో భారతదేశానికి కొత్త ఎంపికలుగా మారుతున్నారు. ఈ విభాగంలో టీమ్ ఇండియాకు బలాన్నిస్తోంది. వీరిలో ఇద్దరు బౌలర్లు శ్రీలంక పర్యటనలో అరంగేట్రం చేశారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియా, కుడిచేతి ఫాస్ట్ బౌలర్ సందీప్ వారియర్. ఇటీవల జరిగిన సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వీరు.. వారి ప్రదర్శనలతో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను ఆకట్టుకున్నారు.

వన్డే సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో సకారియా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండవ టీ 20 మ్యాచ్ నుంచి టీమిండియా తరపును ఆడాడు. మరోవైపు, సందీప్ వారియర్ టీ 20 సిరీస్ చివరి మ్యాచ్‌లో నీలిరంగు జెర్సీ ధరించే అవకాశం అందుకున్నాడు. చాలా మంది ఇతర ఆటగాళ్ల మాదిరిగానే, అతను కూడా అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. కాగా, చాలా మంది సీనియర్ ఆటగాళ్లు లేకుండా కేవలం కుర్రాళ్లతో కలిసి శ్రీలంకలో అడుగుపెట్టింది టీమిండియా.

మెక్‌గ్రాత్ అభినందన.. ఈ ఇద్దరు బౌలర్లకు టీమ్ ఇండియా టోపీ అందివ్వడం అంటే వారి సామర్థ్యంపై మేనేజ్‌మెంట్‌కు మంచి నమ్మకం ఏర్పడింది. వారి అరంగేట్రం కారణంగా చాలా మంది భారత అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. ఆస్ట్రేలియన్ లెజెండ్ మెక్‌గ్రాత్ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మెక్‌గ్రాత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో, “భారతదేశం తరుపున అరంగేట్రం చేసిన చేతన్ సకారియా, సందీప్ వారియర్‌కి అభినందనలు. మీ ఇద్దరి గురించి నేను చాలా గర్వపడుతున్నాను. మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి” అంటూ రాసుకొచ్చాడు.

మెక్‌గ్రాత్ సంతోషానికి కారణం ఏంటంటే.. ఆస్ట్రేలియన్ లెజెండ్స్ భారత బౌలర్ల అరంగేట్రంలో ఎందుకు సంతోషంగా ఉన్నారనేనే ప్రశ్న తలెత్తుతుంది? అతను టీమిండియా కోచ్ లేదా ఏ ఐపీఎల్ జట్టు లేదా ఏ రాష్ట్ర జట్టు కోచ్ గాను చేయడంల లేదు కాదా. మరి వారిని ఎందుకు పొగడ్తలతో ముంచెత్తాడని అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి, క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకరైన మెక్‌గ్రాత్ భారతదేశంలోని ప్రముఖ అకాడమీ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. భారతదేశంలోని అగ్రశ్రేణి బౌలర్లు కూడా ఈ ఫౌండేషన్‌లో తమ వంతుగా ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొన్నవారే. ఇది భారతదేశంలో ఫాస్ట్ బౌలర్లను కనుగొని మరింతగా రాటుదేల్చుతోంది. సందీప్ వారియర్, చేతన్ సకారియా కూడా ఈ అకాడమీలో భాగంగా ఉన్నవారే. అందుకే వీరిని ప్రత్యేకంగా మెక్‌గ్రాత్ అభినందించాడు.

Also Read: Tokyo Olympics 2020: వీరి హెయిర్ స్టైల్ భలే ఉందే..! ఒలింపిక్స్‌లో ఆటతోనే కాదు.. తలకట్టుతోనూ ఆకట్టుకుంటోన్న క్రీడాకారులు

Viral Video: మ్యాచ్ ఓడిపోయిన నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్.. కోర్టులో సహనం కోల్పోయి కోపంతో ఏం చేశాడో తెలుసా?

IND vs ENG: ‘నేను అద్భుతంగా రాణిస్తున్నానంటే అవే కారణం.. వారితో నిత్యం టచ్‌లో ఉంటా’

Latest Articles