- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo olympics 2020 interesting hairstyles from shelly ann fraser megan rapinoe stephanie mawuli romane dicko naomi osaka
Tokyo Olympics 2020: వీరి హెయిర్ స్టైల్ భలే ఉందే..! ఒలింపిక్స్‌లో ఆటతోనే కాదు.. తలకట్టుతోనూ ఆకట్టుకుంటోన్న క్రీడాకారులు
Tokyo Olympics 2020: ఒలంపిక్స్‌లో పోటీలు చివరి దశకు చేరకుంటున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు ఈ పోటీల్లో తమ దేశాలకు పతకాలు అందించేందుకు తీవ్రంగా పోరాడుతున్నారు. అలాగే మరికొంత మందిమాత్రం ఆటతోనే కాదు.. వారి హెయిర్‌స్టైల్‌తోనూ ఒలింపిక్స్‌లో సందడి చేస్తున్నారు.
Updated on: Aug 01, 2021 | 9:04 AM

ఈ ఫోటోలో ఉన్నది జమైకా స్పింటర్ ఎలైన్ థాంప్సన్ హెరా. 100, 200 మీటర్ల రేసులో ఛాంపియన్‌గా నిలిచింది. అత్యధిక 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా రికార్డు సాధించింది. ఈ ఈవెంట్‌లో ఆమె రెండుసార్లు ఒలింపిక్, నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే 200 మీటర్ల రేసులో ఒక రజత పతకం, ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణం సాధిచింది. మొత్తం ఆరు ఒలింపిక్ పతకాలు సాధించిన హెరా.. తన హెయిర్ స్టైల్‌తో కూడా చాలామంది దృష్టిని ఆకర్షిస్తుంది.

జపాన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ స్టెఫానీ మోలీ అద్భుతమైన ఆటతో పాటు ప్రత్యేకమైన జుట్టుతో ఆకట్టుకుంటోంది. టోక్యో ఒలింపిక్స్ కోసం తన జుట్టుకు మూడు-నాలుగు రంగులు వేసుకుంది. జపాన్ మహిళల బాస్కెట్‌బాల్ జట్టు ఐదవ స్థానంలో నిలిచింది.

రోమన్ డికో ఫ్రాన్స్‌కు చెందిన జూడో ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో 78 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రెండుసార్లు యూరోపియన్ ఛాంపియన్‌షిప్ విజేత కూడా నిలిచింది. క్రీడలతో పాటు రోమన్ డికో కూడా కేశాలంకరణతో వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

ఎమియా క్లార్క్ కరీబియన్ దేశం సెయింట్ కిట్స్, నెవిస్ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంది. ఆమె 100 మీటర్ల రేసులో అథ్లెట్‌గా బరిలోకి దిగింది. టోక్యో ఒలింపిక్స్ 2020 ప్రారంభ వేడుకలో ఎమియా తన దేశానికి నాయకత్వం వహించింది.

నవోమి ఒసాకా జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది. ఇటీవల, నవోమి ఒసాకా కూడా తన హెయిర్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

కెన్యా మహిళల వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లందరూ విభిన్నంగా కనిపించారు.

అమెరికా స్టార్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మేగాన్ రాపినో 2012 లండన్ ఒలింపిక్స్, 2015, 2019 వరల్డ్ కప్‌లో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యురాలు. మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులలో స్టార్ ప్లేయర్‌గా రాణిస్తున్నారు.

టర్కిష్ మహిళా వాలీబాల్ క్రీడాకారిణి ఎబ్రార్ కరాకుర్ట్ మిగితా ఆటగాళ్ల కంటే భిన్నమైన హెయిర్ స్టైల్ కలిగి ఉంది.

కీరన్ బెడ్‌లా నెదర్లాండ్స్‌కు చెందిన విండ్‌సర్ఫర్ టోక్యో ఒలింపిక్స్ 2020లో అవతార్ సినిమా లాంటి హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. ఒలింపిక్ క్రీడలలో బంగారు పతకం సాధించాడు.

మానీ శాంటియాగో ప్యూర్టో రికో టోక్యో ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డింగ్‌లో తొలి రౌండ్ల నుంచి నిష్క్రమించాడు. కానీ హెయిర్ స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించాడు.

మరియా ఫజెకాస్ హంగేరియన్ అథ్లెట్ టేబుల్ టెన్నిస్ ఆడుతుంది. ఆమె తన హెయిర్‌స్టైల్‌లో ఒలింపిక్ రింగులకు చోటిచ్చింది.




