5

Accident: డ్రైవర్ లేకుండానే పరుగులు తీసిన ట్రాక్టర్.. 12 బైక్‌లను ధ్వంసం చేసేసింది..

Medak News: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో వింత ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపక్కన పార్క్ చేసిన ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు..

Accident: డ్రైవర్ లేకుండానే పరుగులు తీసిన ట్రాక్టర్.. 12 బైక్‌లను ధ్వంసం చేసేసింది..
Accident
Follow us

|

Updated on: Jul 30, 2021 | 7:11 PM

Medak News: మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో వింత ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపక్కన పార్క్ చేసిన ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. డ్రైవర్ లేకుండా దూసుకువచ్చిన ఆ ట్రాక్టర్.. రోడ్డుపై ఉన్న బైక్‌లను తోసుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 12 బైక్‌లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్‌ పట్టణంలో రోడ్డుపై ట్రాక్టర్‌‌ను పార్క్ చేశారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ పనిమీద పక్కానే ఉన్న షాపులోకి వెళ్లాడు. అప్పటి వరకు బాగానే ఉన్న ట్రాక్టర్.. ఉన్నట్లుగా ఒక్కసారిగా ముందుకు కదిలింది. తొలుత నెమ్మదిగానే కదిలినప్పటికీ.. ఆ తరువాత వేగం పెరిగింది. ఈ క్రమంలో ముందు వైపు పార్క్‌ చేసిన బైక్‌లను ట్రాక్టర్ ఢీకొట్టింది. మొదట ఒక బైక్‌ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఆ బైక్‌ను ఈడుస్తూ ముందుకు కదిలింది. అలా దాదాపు 12 బైక్‌లను ట్రాక్టర్ ఢీకొట్టింది.

కాగా, ట్రాక్టర్‌ ముందుకు కదలడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు వెంటనే అప్రమత్తమై.. ఆ ట్రాక్టర్‌ను నిలువరించే ప్రయత్నం చేశారు. నలువైపుల నుంచి వచ్చి దానిని అడ్డుకునేందుకు ట్రై చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ ట్రాక్టర్‌ను ఎక్కి.. బ్రేక్ వేశాడు. దాంతో అది నిలిచిపోయింది. ప్రమాదం తప్పింది. పార్క్ చేసిన ట్రాక్టర్ ముందుకు కదలడం, బైక్‌లను ఢీకొనడం ఘటన అంతా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. కాగా, ఈ ఘటనలో బైక్‌లు ధ్వంసం అయ్యాయి తప్ప.. మనుషులెవరూ ప్రమాదం బారిన పడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

AP Corona Case: ఏపీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు.. ఐదు జిల్లాల్లో వందలోపే.. మిగిలిన చోట్ల మారని తీరు!

Kannababu: రైతులకు విన్నపం : సాగు చేసే ప్రతి పంట ఈ-క్రాప్‌లో రిజిస్టర్‌ చేయించాలి : వ్యవసాయ శాఖ మంత్రి

కూతురి మరణంపై ఇప్పటికీ న్యాయ పోరాటం.. దీనస్థితిలో చిన్నారి పెళ్లి కూతురు నటి పేరెంట్స్..

ఇండియా కూటమిలో విభేదాలు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ఇండియా కూటమిలో విభేదాలు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
'వై ఏపీ నీడ్స్‌ జగన్‌' పేరిట ప్రచారం.. సీఎం దిశానిర్దేశం..
'వై ఏపీ నీడ్స్‌ జగన్‌' పేరిట ప్రచారం.. సీఎం దిశానిర్దేశం..
దేశ రాజధానిని షేక్‌ చేసిన చోరీ ఘటన.. ఏకంగా రూ.25 కోట్ల నగలు లూటీ
దేశ రాజధానిని షేక్‌ చేసిన చోరీ ఘటన.. ఏకంగా రూ.25 కోట్ల నగలు లూటీ
వన్డేల్లో 4వ ప్లేయర్‌గా రికార్డ్‌ సృష్టించిన మహ్మదుల్లా..
వన్డేల్లో 4వ ప్లేయర్‌గా రికార్డ్‌ సృష్టించిన మహ్మదుల్లా..
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. 32 శాతం బోనస్
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. 32 శాతం బోనస్
అద్దెకు సల్మాన్ ఖాన్ అపార్ట్‏మెంట్.. నెలకు రెంట్ తెలిస్తే..
అద్దెకు సల్మాన్ ఖాన్ అపార్ట్‏మెంట్.. నెలకు రెంట్ తెలిస్తే..
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురు అరెస్టు
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు.. ఆరుగురు అరెస్టు
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర టీడీపీ నేతలు.. ఆ నియోజకవర్గాల్లో పర్యటన
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర టీడీపీ నేతలు.. ఆ నియోజకవర్గాల్లో పర్యటన
అక్టోబర్​ నెలలో బ్యాంక్​లకు సగం సెలవులే.. లిస్ట్‌ ఇదే..!
అక్టోబర్​ నెలలో బ్యాంక్​లకు సగం సెలవులే.. లిస్ట్‌ ఇదే..!
సింగరేణి ఎన్నికలపై హైకోర్ట్ కీలక ఉత్తర్వులు..
సింగరేణి ఎన్నికలపై హైకోర్ట్ కీలక ఉత్తర్వులు..